పానిండియా సూపర్‌స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా షూటింగ్‌ను గత ఏడాది ద్వితీయార్ధంలో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఓ షెడ్యూల్‌ని కూడా పూర్తి చేశారాయన. ప్రస్తుతమైతే షూటింగ్‌కి కాస్త విరామం ఇచ్చారు. ఈ గ్యాప్‌లో నటీనటుల ఎంపిక, నెక్ట్స్ షెడ్యూల్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సందీప్‌రెడ్డి నిమగ్నమైనట్టు చిత్రబృందం చెబుతున్నది. మరోవైపు ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ షూట్లో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మళ్లీ ‘స్పిరిట్’ షూటింగ్ ఈ ఏడాది మే తొలివారంలో ప్రారంభం కానున్నది.
ఇది భారీ షెడ్యూల్ అనీ, నిరవధికంగా జరిగే ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని చిత్రయూనిట్ చెబుతున్నది. వచ్చే ఏడాది మార్చి 5న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ‘స్పిరిట్’లో ప్రభాస్ పవర్ఫుల్ ఐపీఎస్ అధికారిగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ పాత్ర కోసం ఆయన మరింత ఫిట్‌గా మారారు. సందీప్‌రెడ్డి వంగా మార్క్ హీరోగా కొత్త ప్రభాస్‌ని ఇందులో చూస్తారని చిత్రబృందం చెబుతున్నది. త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్‌రాజ్, సీనియర్ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.