Amazon Prime Day Sale | అమెజాన్ ప్రైమ్ డే సేల్.. రూ.20 వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..!
Amazon Prime Day Sale | అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ కింద వన్ ప్లస్, రియల్ మీ, రెడ్ మీ వంటి ఫోన్ల తయారీ సంస్థలు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.
Amazon Prime Day Sale | ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ఆదివారం అర్ధరాత్రి 11.59 గంటలకు ముగుస్తాయి. ఆలస్యమైనా మీరు మెరుగైన ధరకు స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే ఓ లుక్కేయండి. రెండు రోజుల పాటు సాగే ఈ డిస్కౌంట్ సేల్స్లో స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, గృహోపకరణాలు, పర్సనల్ కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్స్ లో భాగంగా వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. రూ.20 వేల లోపు ధరకే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లను సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ సందర్భంగా రూ.20 వేల లోపు విలువ గల స్మార్ట్ ఫోన్లపై ఇచ్చే డిస్కౌంట్లకు అదనంగా బ్యాంక్ బెనిఫిట్లు, క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులు, ఎస్బీఐ క్రెడిట్ కార్డు దారులకు అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇటీవలే మార్కెట్లో ఆవిష్కరించిన వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ ధర రూ.19,999 కాగా, డిస్కౌంట్ మీద రూ.16,999లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే రెడ్మీ నోట్ 13 5జీ ఫోన్ ఎంఆర్పీ రూ.20,999 కాగా, డిస్కౌంట్ వల్ల రూ.16,999లకే లభిస్తుంది. కొన్ని స్మార్ట్ ఫోన్లపై ఎక్స్చేంజ్ ఆఫర్లతో వాటి ధరలు తగ్గుతాయి.
రూ.20 వేల లోపు ధరకు లభించే స్మార్ట్ ఫోన్లు ఇవే..
స్మార్ట్ ఫోన్ – ఎంఆర్పీ – డిస్కౌంట్ ధర
వన్ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ – రూ.19,999 -రూ. 16,999
రియల్మీ నార్జో 70 ప్రో 5జీ – రూ. 24,999- రూ. 15,249
ఐక్యూ జడ్9 5జీ – రూ. 24,999 – రూ. 16,999
రెడ్మీ నోట్ 13 5జీ – రూ. 20,999 – రూ. 15,499
వన్ప్లస్ నార్డ్ సీఈ3 – రూ. 26,999 – రూ. 18,999
వివో వై28ఎస్ 5జీ – రూ. 17,999 – రూ. 13,249
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

