సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదయం 9గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయం త్రం 5వరకు ఎండలు మండిపోతుండటంతో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23 డిగ్రీలు, గాలిలో తేమ 42 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.