IPL : పొట్టి క్రికెట్‌కు ఎనలేనిక్రేజ్ తెచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చిందంటే చాలు ఆటగాళ్లపై కాసుల వర్షమే. సీజన్‌కు ముందు జరిగే మినీ లేదా మెగా వేలంలో కోట్లు కొల్లగొట్టింది ఎవరు? అనామకులు ఎంత పలికారు? అనేవి చర్చనీయాంశాలు అవుతాయి. దేశవాళీనే నమ్మకున్న ఎందరో ఆటగాళ్ల జీవితాలను మార్చేసిన ఐపీఎల్.. పలువురిని లక్షాధికారులను చేసింది. ఇక టీమిండియా స్టార్ ఆటగాళ్లను అయితే ఏకంగా కోట్లకు పడగలెత్తేలా చేసింది. ఐపీఎల్ 17 సీజన్లలో పలువురు సీనియర్ క్రికెటర్లు ఏకంగా వందల కోట్ల రూపాయలు ఆర్జించారు. ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే..?
ఐపీఎల్ చరిత్రలో రికార్డుల వీరుడిగా పేరొందిన రోహిత్ శర్మ (Rohit Sharma) ఆదాయంలోనూ టాపరే. తన ఫుల్షాట్లతో అభిమానులను అలరించే రోహిత్ ఐపీఎల్లో రికార్డు స్థాయిలో సంపాదించాడు. ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు 5 ట్రోఫీలు కట్టబెట్టిన హిట్‌మ్యాన్ 17 సీజన్లలో ఏకంగా రూ.194.6 కోట్లు ఆర్జించాడు. ఇక రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఉన్నాడు. మహీ భాయ్ 17 సీజన్లలో రూ.188.84 కోట్లు సంపాదించాడు.
ఐపీఎల్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లతో కింగ్ అనిపించుకున్న విరాట్ కోహ్లీ కూడా కోట్లు వెనకేశాడు. సీజన్ ఆరంభం నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న విరాట్ రూ.188.2 కోట్లు కొల్లగొట్టాడు. చెన్నై సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా తగ్గేదేలే అంటూ రూ.1245.01 కోట్లు సంపాదించాడు. టాప్ -5లో నలుగురు భారత క్రికెటర్లు ఉండగా.. ఐదో స్థానం మాత్రం సునీల్ నరైన్ సొంతం చేసుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ప్లేయర్ అయిన నరైన్ ఐపీఎల్ ద్వారా రూ.113.25 కోట్లు రాబట్టాడు.
Check out the top earners in IPL history!💰#IPL2025 pic.twitter.com/wCLDlGlpuM
— CricTracker (@Cricketracker) October 30, 2024
ఐపీఎల్ 18వ సీజన్ మెగా వేలం నవంబర్‌లో జరుగనుంది. సౌదీ అరేబియాలోని రియాద్‌లో 25, 26వ తేదీల్లో వేలం ప్రక్రియ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. 17వ సీజన్ మినీ వేలంలో మిచెల్ స్టార్క్ (Mitchell Starc) రూ.27.5 కోట్లతో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దాంతో, ఈసారి మెగా వేలంలో స్టార్క్ రికార్డును బ్రేక్ అవుతుందా? లేదా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
మిచెల్ స్టార్క్