అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా రూపుదిద్దుకుంటున్న పోలవరం ప్రాజెక్టు సీఎం చంద్రబాబు (Chandra Babu ) నాయుడుకి ఏటీఎంగా (ATM) మారిందని వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (YCP MP Vijayasai Reddy) ఆరోపించారు. ఈ మేరకు గురువారం ట్విటర్ వేదిక ద్వారా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టు.
అధికారంలోకి రావడం ఆలస్యం-పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు చంద్రబాబు.
ప్రాజెక్టు నిధులను దారిమళ్లించడమే కాక ప్రాజెక్టుకు చంద్ర గ్రహణం పట్టిస్తున్నాడు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తే తాగు, సాగు నీటి…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 31, 2024
అధికారంలోకి రావడంమే ఆలస్యంగా పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) ఎత్తును తగ్గించి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిధులను దారిమళ్లించడమే కాక ప్రాజెక్టుకు చంద్ర గ్రహణం పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తే తాగు, సాగు నీటి అవసరాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు దుర్భుద్ధిని గ్రహించి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.