BAN vs SA 2nd Test : తొలి టెస్టులో విజయంతో జోరు మీదున్న దక్షిణాఫ్రికా (South Africa) రెండో మ్యాచ్‌లోనూ చెలరేగుతోంది. తొలి ఇన్నింగ్స్‌ను 576 వద్ద డిక్లేర్ చేసిన సఫారీ జట్టు అనంతరం బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేసింది. పేసర్ కగిసో రబడ(5/37) నిప్పులు చెరగడంతో ఆతిథ్య బంగ్లా 159 పరుగులకే కుప్పకూలింది. మొమినుల్ హక్(82) ఒంటరి పోరాటం చేసిన ఫాలో ఆన్ తప్పించలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా వికెట్ కోల్పోకుండా 4 పరుగులు చేసింది. ఓపెనర్లు షద్మన్ ఇస్లాం(2), మహ్ముదుల్ హసన్ జాయ్(2)లు క్రీజులో ఉన్నారు. ఇంకా 410 పరుగులు వెనకబడే ఉన్నబంగ్లాదేశ్కు ఓటమి తప్పకపోవచ్చు.
మిర్పూర్లో జయభేరి మోగించి 12 ఏండ్ల తర్వాత ఆసియా గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసిన దక్షిణాఫ్రికా మళ్లీ గెలుపు వాకిట నిలిచింది. ఛత్రోగ్రామ్లోని జహుర్ అహ్మద్ చౌదరీ స్టేడియంలో సఫారీ కుర్రాళ్లు శతకాలతో చెలరేగారు. ఓపెనర్ టోనీ డి జొర్జి(177), ట్రిస్టన్ స్లబ్స్(100)లు బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ వంద కొట్టేశారు. ఇక రెండో రోజు తన వంతు అన్నట్టు వియాన్ మల్డర్(105) సెంచరీతో గర్జించాడు. దాంతో, దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్ జట్టు స్కోర్ 576-6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాకు స్పీడ్‌స్టర్ రబడ షాకిచ్చాడు.
A 103-run ninth-wicket stand between Mominul Haque and Taijul islam, after Kagiso Rabada picked up his second five-for of the series and the 16th of his career 🙌
South Africa enforce the follow on in Chattogram https://t.co/zRhCZqpZjI | #BANvSA pic.twitter.com/qBplDktHel
— ESPNcricinfo (@ESPNcricinfo) October 31, 2024
ఓపెనర్ షద్మన్ ఇస్లాం(0)ను డకౌట్ చేసిన రబడ.. ఆ తర్వాత డేంజరస్ జకీర్ హసన్(2), నజ్ముల్ హుసేన్ శాంటో(9)లను ఔట్ చేసి బంగ్లాను ఒత్తిడిలో పడేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మొహినుల్ హక్(82) అర్ధ శతకంతో పోరాడాడు. 9వ వికెట్‌కు తైజుల్ ఇస్లాం(30)తో కలిసి 103 పరుగులు జోడించాడు. అయితే.. రబడ సఫారీలకు బ్రేకిస్తూ తైజుల్ను వెనక్కి పంపి ఐదో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న మొమినుల్ను సెనురన్ ముత్తుస్వామి ఎల్బీగా వెనక్కి పంపాడు. టెయిలెండర్లను రబడతో కలిసి కేశవ్ మహరాజ్ చుట్టేశాడు. దాంతో, బంగ్లా 159 పరుగులకే ఆలౌట్ అయి ఫాలో ఆన్ ప్రమాదంలో పడింది.