Pushpa 2 | అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కతున్న పుష్ప-2 మూవీ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్ ప్రకటించారు. గతంలో డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీపావళి పండగ సందర్భంగా రష్మిక, అల్లు అర్జున్ రొమాంటిక్ పోస్టర్‌ను మేకర్ వదిలారు. ప్రస్తుతం పోస్టర్ వైరల్‌గా మారింది. పుష్ప ది రైజ్ చిత్రం పాన్ ఇండియా స్థానంలో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత పుష్ప-2 ది రూల్‌పై మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మూవీని ఆరు భాషల్లో కలిపి 11,500 స్క్రీన్స్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఓవర్సీస్లో 5వేల స్క్రీన్స్, భారత్‌లో 6500 స్క్రీన్స్‌లో విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తున్నది.
ఈ మూవీ భారతీయ సినీ చరిత్రలో బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమాగా నిలుస్తుందని పేర్కొంటున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, ఒడియా భాషలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇక ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్నది. ఫహాద్ ఫాజిల్, రావు రమేశ్, అనసూయ భరద్వాస్, జగపతిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా.. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాధ్యతలు పోలెండ్ కెమెరామెన్ కూబాకు అప్పగించారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుందని టాక్ వినిపిస్తున్నది. ఈ సాంగ్‌ను నవంబర్ 4 నుంచి షూటింగ్ జరుపుకోనందని.. ఇక రెండోవారంలో మరో ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత నుంచి మూవీ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టనున్నట్లు తెలుస్తున్నది.
Happy Diwali!! #Pushpa2TheRule pic.twitter.com/V5Xcp4RF7y
— Allu Arjun (@alluarjun) October 31, 2024