అడిలైడ్: రోహిత్ శర్మ(Rohit Sharma) తన బ్యాటింగ్ పొజిషన్‌ను మార్చేశాడు. అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టులో.. కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌లో ఆడనున్నట్లు తెలిపాడు. పెర్త్ టెస్టులో ఓపెనింగ్‌లో ఆడిన రాహుల్.. 26, 77 రన్స్ స్కోర్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌తో కలిసి 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ టెస్టులో ఇండియా 295 రన్స్ తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. పెర్త్ టెస్టుకు రోహిత్ శర్మ గైర్హాజరు కావడంతో.. జైస్వాల్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ఓపెన్ చేశాడు.
ఇవాళ మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేస్తాడని, మిడిల్ ఆర్డర్లో తాను ఆడనున్నట్లు చెప్పాడు. ఆ పొజిషన్లో ఆడడం తనకు ఈజీ కాదు అని, కానీ జట్టు మంచి కోసం తన పొజిషన్‌ను త్యాగం చేయాల్సి వస్తుందని రోహిత్ తెలిపాడు. కుమారుడు పుట్టడంతో.. రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరం అయ్యాడు. ఆ బ్రేక్ నుంచి వచ్చిన అతను రేపటి నుంచి జరిగే టెస్టులో ఆడనున్నాడు.
ఇవి కూడా చదవండి..
Scott Boland: రేపటి నుంచి రెండో టెస్టు.. ఆసీస్ జట్టులోకి బోలాండ్