న్యూఢిల్లీ: భారత్‌తో అడిలైడ్‌లో శుక్రవారం నుంచి జరగనున్న రెండో టెస్టుకు ఆస్ట్రేలియా తుది జట్టును ప్రకటించింది. స్పీడ్ బౌలర్ స్కాట్ బోలాండ్(Scott Boland)కు స్థానం కల్పించారు. 18 నెలల బ్రేక్ తర్వాత అతను మళ్లీ జాతీయ జట్టుకు ఆడనున్నట్లు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తెలిపాడు. అడిలైడ్‌లో డే అండ్ నైట్ టెస్టు కావడంతో.. బోలాండ్కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. తొలి టెస్టులో గాయపడ్డ జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో అతన్ని తీసుకున్నారు. ఆల్‌రౌండర్ మార్ష్‌కు వెన్ను నొప్పి ఉన్నా.. అతన్ని రెండో టెస్టుకు కొనసాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మనూకా ఓవల్‌లో ప్రైమ్‌మినిస్టర్ లెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో బోలాండ్ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. వికెట్ తీసుకోకున్నా.. బ్యాటర్‌ను కట్టడి చేయగలిగాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండు జట్ల మధ్య అయిదు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో 295 రన్స్ తేడాతో ఇండియా నెగ్గింది.
JUST IN: Skipper Pat Cummins confirms one change for Australia for the second Test #AUSvIND
Details: https://t.co/Q0VdwRyLQs pic.twitter.com/IklVy2a5Zc
— cricket.com.au (@cricketcomau) December 5, 2024