హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్నది. ఇప్పటికే అప్పుల భారంతో సతమతమవుతున్న రేవంత్రెడ్డి సర్కార్, తాజాగా మరోసారి భారీ రుణానికి సిద్ధమైంది. బడ్జెట్ అంచనాలను ఏనాడో అధిగమించిన సరార్, ఇప్పుడు నిత్యావసర ఖర్చుల కోసం కూడా అప్పులపైనే ఆధారపడాల్సిన దుస్థితికి చేరుకున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ నెల 17న నిర్వహించబోయే ఈ-వేలంలో పాల్గొని, మరో రూ.2,540 కోట్ల అప్పు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఆర్బీఐకి ఇండెంట్ పంపింది. 19 ఏండ్ల కాల పరిమితితో రూ.540 కోట్లు, 28 ఏండ్ల కాల పరిమితితో రూ.1000 కోట్లు, 30 ఏండ్ల కాలానికి రూ.1000 కోట్లు తీసుకుంటామని, ఇందుకు అవసరమైన సెక్యూరిటీ బాండ్లు పెడతామని, తమకు ప్రతిపాదనలు పంపించినట్టు ఆర్బీఐ తాజాగా వెల్లడించింది.
అదుపు తప్పిన బడ్జెట్ లెకలు
రాష్ట్ర వార్షిక బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దేశించుకున్న రుణ అంచనాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రతిపాదనలు రూ.54,009 కోట్లు ఉండగా, ఇప్పటివరకు సేకరించిన రుణాలు అక్షరాలా రూ.83,300 కోట్లకు (154.23 శాతం)చేరాయి. అంటే, ఆర్థిక సంవత్సరం ముగియక ముందే బడ్జెట్ అంచనాల కంటే దాదాపు రూ.29,000 కోట్లకుపైగా అదనపు అప్పులు చేయడం ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వైఫల్యానికి అద్దం పడుతున్నది. 17న తీసుకోబోయే రూ.2,540 కోట్ల అప్పు కలుపుకుంటే మొత్తం రూ.85,840 కోట్లకు (158.93 శాతం) చేరనున్నది. రాష్ట్ర సొంత ఆదాయ మార్గాలు సృష్టించుకోవడంలో విఫలమైన రేవంత్ సర్కార్ ప్రతి నెలా అప్పు చేస్తేగానీ బండి నడవని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే అప్పుల కుప్పగా మారిన తెలంగాణపై ఈ అదనపు భారం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉన్నది. సంక్షేమ పథకాలు, జీతభత్యాల కోసం కూడా అప్పుల వైపు చూడటం ఆర్థిక క్రమశిక్షణారాహిత్యమేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పు
క్యూ-4లో