IND Vs AUS | బోర్డర్ గవాస్కర్ టెస్ సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ అడిలైడ్ వేదికగా జరుగనున్నది. ఈ డే-నైట్ మ్యాచ్‌లో గులాబీ బంతితో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనున్నది. ఈ మ్యాచ్‌లో త్వరగా పాతబడకుండా ఉండేందుకు పిచ్‌పై ఆరు మిల్లీమీటర్ల గడ్డిని అలాగే ఉంచనున్నట్లు మ్యాచ్‌కు ముందు అడిలైడ్ ఓవల్ పిచ్ క్యూరేటర్ డామియన్ హాఫ్ చెప్పారు. పెర్త్‌లో టీమిండియా రికార్డు స్థాయిలో 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ ఆధిక్యంలో ఉన్నది. రెండో టెస్ట్‌లో స్పిన్ బౌలింగ్ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. పిచ్‌పై గడ్డి ఉండడంతో ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లకు సహకరించే అవకాశం ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లు సహకరిస్తుందని క్యూరేటర్ డామియన్ పేర్కొన్నారు.
అడిలైడ్‌లో లైట్ల వెలుతురులో బ్యాటింగ్ కష్టమని చరిత్ర చెబుతున్నది. పిచ్‌పై ఆరు మిల్లీమీటర్ల గ్రాస్ ఉండడం బ్యాటింగ్‌కు కష్టంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎండిపోయి కట్టిగా ఉన్న గడ్డిని వదిలేసేందుకు ప్రయత్నిస్తున్నామని.. గరిష్ఠ వేగంతో పాటు బౌన్స్ వచ్చేందుకు గ్రాస్‌ని వదిలేస్తున్నట్లు క్యూరేటర్ పేర్కొన్నారు. పెర్త్ టెస్ట్‌లో మ్యాచ్ సాగుతున్న కొద్దీ బ్యాటింగ్ సులువుగా మారింది. పిక్ బాల్ టెస్ట్ కోసం సైతం క్యూరేటర్ ఇదే ప్రణాళికతో పిచ్‌ను రెడీ చేస్తున్నారు. సాధారణంగా స్పిన్ పాత్ర పోషిస్తుంది. గడ్డి కారణంగా బంతి వేగంగా దూసుకెళ్లడంతో పాటు సాధారణంగా బౌన్స్ వస్తుంది.
బంతి పాతబడుతున్న కొద్దీ బ్యాట్స్‌మన్ దాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు క్యూరేటర్ చెప్పుకొచ్చారు. పెర్త్ టెస్టులో స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారని.. అడిలైడ్ ఓవల్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని చెప్పారు. అడిలైడ్‌లో స్పిన్ కీలకపాత్ర పోషిస్తుందని.. మ్యాచ్‌లో స్పెషలిస్ట్ స్పిన్నర్‌ని తుదిజట్టులో తీసుకోవాలన్నారు. మ్యాచ్‌లో ఇరు జట్లు రాణించడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఫాస్ట్ బౌలర్లతో పాటు రాత్రి సెషన్లో స్పిన్ కీలకపాత్ర పోషించేలా బ్యాలెన్స్‌ను సరి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 2020లో ఇదే మైదానంలో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో టీమిండియాకు ఇదే తొలి పింక్ బాల్ టెస్ట్. అయితే, పిచ్‌లో ఎలాంటి లోపం లేదని హాఫ్ చెప్పుకొచ్చారు.
పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రానా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
రిజర్వ్ ప్లేయర్లు : ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్, యశ్ దయాల్.