IPL 2025 : టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ (Rohit Sharma) మళ్లీ బ్యాట్ అందుకున్నాడు. ఐపీఎల్ 18వ సీజన్ తదుపరి మ్యాచ్‌లపై ఫోకస్ పెట్టిన హిట్‌మ్యాన్.. నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. ముంబై ఇండియన్స్ (Mumbai Indians)ను ప్లే ఆఫ్స్ చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్న అతడు మరింత చెలరేగి ఆడాలని అనుకుంటున్నాడు. అందుకే పేస్, స్పిన్ బౌలింగ్‌లో పెద్దషాట్లు అడుతూ అలరించాడీ మాజీ కెప్టెన్. రోహిత్ సహ ముంబై క్రికెటర్లు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్‌లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ఫ్రాంచైజీ ఎక్స్ ఖాతాలో పెట్టింది.
ప్రస్తుతం ముంబై 7 విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స చేరాలంటే ఇంకో రెండు విజయాలు తప్పనిసరి. కాబట్టి మే 21న వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)పై విజయమే లక్ష్యంగా ముంబై బరిలోకి దిగనుంది. అనంతరం మే 26న పంజాబ్‌ను హార్దిక్ పాండ్యా బృందం ఢీ కొట్టనుంది. ఈ రెండు మ్యాచుల్లోముంబైకి రోహిత్ శుభారంభాలు ఇస్తే సరి.. మిగతాది సూర్య, తిలక్, పాండ్యాలు చూసుకుంటారు.
𝙋𝙧𝙚𝙥𝙨 𝙞𝙣 𝙥𝙡𝙖𝙘𝙚 💪@mipaltan are back to the grind, resuming their training with eyes on the Playoff spot 👊#TATAIPL pic.twitter.com/BvXURW2os9
— IndianPremierLeague (@IPL) May 14, 2025
భారత టెస్టు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ మే 7న వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. నిరుడు న్యూజిలాండ్ చేతిలో.. ఆపై ఆస్ట్రేలియా గడ్డపై విఫలమైన అతడి సారథిగానూ తేలిపోయాడు. దాంతో, సుదీర్ఘ ఫార్మాట్లో ఫామ్‌లేమితో బాధ పడుతున్న అతడు రిటైర్ అవ్వడమే మంచిదని భావించాడు. ఇంగ్లండ్ పర్యటనకు తనను పక్కన పెట్టేస్తారనే వార్తలు అందుకు ఆజ్యం పోశాయి. దాంతో, ఇక వైట్ జెర్సీకి గుడ్ బై చెప్పేశాడు. సిక్సర్ల వీరుడిగా పేరొందిన రోహిత్ 62 టెస్టుల్లో 12 శతకాలు సాధించాడు.