IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ కొత్త షెడ్యూల్ ప్రకారం జరుగనుంది. అయితే.. స్వదేశం వెళ్లిన విదేశీ క్రికెటర్లలో కొందరు తదుపరి మ్యాచ్‌లకు దూరం కానున్నారు. వ్యక్తిగత కారణాలతో అందుబాటులో ఉండడం లేదని చెబుతున్నారు. ఇంగ్లండ్ క్రికెటర్లు జోఫ్రా ఆర్చర్ (Jofra Archer), జేమీ ఓవర్టన్, సామ్ కరాన్ (Sam Curran)లు సీజన్ మిగతా మ్యాచ్‌లు దూరం అయ్యారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ బోర్డులోని అధికారి ఒకరు వెల్లడించాయి.
అయితే.. విధ్వంసక వికెట్ కీపర్ జోస్ బట్లర్(Jos Buttler), జాకబ్ బెథెల్, లియాం లివింగ్‌స్టోన్, విల్ జాక్స్ (Will Jacks) మాత్రం ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వీళ్లు తాము వస్తున్నట్టు ఫ్రాంచైజీలకు సందేశమిచ్చారు. బుధవారమే ఈ నలుగురు భారత్‌కు బయల్దేరుతున్నారని సమాచారం.
As per reports, England players Jofra Archer, Jamie Overton and Sam Curran will not return to India for the remainder of the IPL.
📸: BCCI#ipl #ipl2025 pic.twitter.com/joiEuCxtUb
— SportsTiger (@The_SportsTiger) May 14, 2025
ప్లే ఆఫ్స్ బెర్తులను నిర్ణయించే కీలక మ్యాచ్‌లు మే 17 నుంచి జరుగున్నాయి. టాప్ 2లో ఉన్న గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), ఆర్సీబీలు ఒక్క విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ చేరుతాయి. దాంతో, ఈ జట్లకు ఇకపై ప్రతి మ్యాచ్ కీలకమే. అందుకే.. గుజరాత్ బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలుస్తున్న జోస్ బట్లర్ స్క్వాడ్‌తో కలిసేందుకు సిద్ధమయ్యాడు.
ఇక తొలి టైటిల్ కలను సాకారం చేసుకోవాలనుకుంటున్న బెంగళూరుకు లివింగ్‌స్టోన్, బెథెల్ కీలకం కానున్నారు. ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు ఆల్‌రౌండర్ విల్ జాక్స్ సేవలు ఎంతో ముఖ్యం. కాబట్టే ఫ్రాంచైజీల విజ్ఞప్తి మేరకు వీళ్లు తిరుగు ప్రయాణమవుతున్నారు.
అయితే.. 18వ సీజన్లో చెత్త ఆటతో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించాయి. లీగ్ దశలో ఇరుజట్లకు రెండేసి మ్యాచ్‌లు ఉన్నాయంతే. సో.. రాజస్థాన్‌కు ఆడుతున్న ఆర్చర్.. సీఎస్కేకు ప్రాతినిధ్యం వహిస్తున్న సామ్ కరన్, ఓవర్టన్‌లు ఈ రెండు మ్యాచ్‌ల కోసం వచ్చి వెళ్లడం ఎందుకని స్వదేశంలోనే ఉండిపోవాలని నిర్ణయించుని ఉంటారనే ప్రచారం జరుగుతోంది.