IND vs SL : పొట్టి వరల్డ్ కప్ తర్వాత తొలి వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(54) వీరవిహారం చేస్తున్నాడు. 231 పరుగుల ఛేదనలో శ్రీలంక బౌలర్లను ఎడాపెడా ఉతికేస్తూ హిట్‌మ్యాన్ అర్ధ శతకం బాదాడు. ఎల్బీ అప్పీల్‌తో బతికిపోయిన రోహిత్ 33 బంతుల్లోనే ఫిఫ్టీ బాదేశాడు.
అకిల ధనంజయ వేసిన 10వ ఓవర్లో సిక్సర్‌తో ఇండియా కెప్టెన్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. దాంతో, టీమిండియా పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 71 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(13) ఆడుతున్నాడు. భారత జట్టు విజయానికి ఇంకా 157 పరుగులు కావాలి.
5⃣6⃣th ODI Fifty! 👏 👏
Rohit Sharma leading from the front! 👌 👌
Follow the Match ▶️ https://t.co/4fYsNEzO5N#TeamIndia | #SLvIND | @ImRo45 pic.twitter.com/vNXe5sdMJo
— BCCI (@BCCI) August 2, 2024
లంక నిర్దేశించిన స్వల్ప ఛేదనను ఓపెనర్ రోహిత్ శర్మ(54) ధాటిగా ఆరంభించాడు. అరంగేట్ర పేసర్ మహ్మద్ షిరాజ్, స్పిన్నర్ దునిత్ వెల్లలాగే బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మూడో ఓవర్ తొలి బంతికే ఎల్బీగా ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న రోహిత్ మరింత రెచ్చిపోయాడు. దాంతో, టీమిండియా స్కోర్ బుల్లెట్టులా ఉరికింది. అంతేకాదు ఓపెనింగ్ జోడీగా రోహిత్, గిల్లు 15వ హాఫ్ సెంచరీ కొట్టేశారు.