Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు (India Hockey Team) క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. చావోరేవో మ్యాచ్‌లో సంచలన ఆటతో బలమైన ఆస్ట్రేలియా(Australia) పై రికార్డు విజయంతో క్వార్టర్స్ బెర్తు సాధించింది. చివరి గ్రూప్ బి చివరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్(Harmanpreet Singh) సారథ్యంలో టీమిండియా అదరగొట్టింది. విశ్వ క్రీడల్లో కొరకరాని కొయ్యలా మారిన ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాను మట్టికరిపించింది.
బెల్జియం చేతిలో 2-1 ఓటమి నుంచి తేరుకున్న భారత జట్టు శుక్రవారం దుమ్మురేపింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 3-2తో కంగారులకు భారత్ చెక్ పెట్టింది. తద్వారా 52 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆసీస్‌పై తొలి విజయం నమోదు చేసింది. 1972 తర్వాత ఆస్ట్రేలియపై ఇదే మొదటి గెలుపు కావడం గమనార్హం. ఆసీస్‌పై కీలక విజయంతో గ్రూప్ బిలో భారత్ రెండో స్థానంలో నిలిచి క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది.