మారేడ్పల్లి, ఆగస్టు 2: రైలు పట్టాల పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని రైలు( Train) ఢీ కొట్టడడంతో అక్కడికక్కడే మృతి(Man died) చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…గాజులరామారం ప్రాంతానికి చెందిన బొక్క నంద కిశోర్ (25) అనే వ్యక్తి గుండ్లపోచంపల్లి- బొల్లారం రైల్వే స్టేషన్ల మధ్యన రైలు పట్టాల పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు.
ఈ క్రమంలో గుర్తు తెలియని రైలు ఢీ కొట్టడడంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.