సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల ఔత్సాహికులు చేసే ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇంటింటా ఇన్నోవేటర్-2024 కార్యక్రమాన్ని(Intinta Innovator-2024) తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నిర్వహిస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వం 5 విడతలుగా కార్యక్రమాన్ని నిర్వ హించగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6వ విడత నిర్వహించేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది.
గ్రామీణ తెలంగాణలో ఆవిష్కరణలు, వ్యవస్థాపకతను పెంపొందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం లో ఎక్కువ మందిని భాగస్వాములను చేసేందుకు గడువును ఆగస్టు 15 వరకుపొడిగించాలని టీఎస్ఐసీ ప్రతినిధి తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి ప్రతియేటా మంచి స్పందన వచ్చిందని, ఈ ఏడాది సైతం ఎక్కువ మంది తమ ఆవిష్కరణలతో పాల్గొనేలా నిర్వహి స్తామని, ఆసక్తి ఉన్న వారు వాట్సాప్ నంబర్ :9100678543కు దరఖాస్తులను పంపించాలని తెలిపారు.