Health Tips | వర్షాకాలంలో బెస్ట్ డ్రింక్స్ ఇవే..!
Health Tips : వర్షాకాలంలో చల్లటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నా పలు ఇన్ఫెక్షన్లు దాడి చేసే ముప్పూ పొంచి ఉంటుంది. వ
Health Tips : వర్షాకాలంలో చల్లటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నా పలు ఇన్ఫెక్షన్లు దాడి చేసే ముప్పూ పొంచి ఉంటుంది. వర్షాలతో నీరు నిలిచే పరిస్ధితి ఏర్పడటం ద్వారా దోమల వ్యాప్తితో పలు రకాల వైరస్లు, ఇన్ఫెక్షన్ల ముప్పు ఎదురవుతుంది. వర్షాకాలంలో వైరస్లు, ఇన్ఫెక్షన్ల బారినపడకుండా రోగనిరోధక శక్తి పెంచే పానీయాలు, ఆహార పదార్ధాలు తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఆరోగ్యకర ఆహారం కీలకమని వైద్యులు సూచిస్తుంటారు.
ఇక ఈ సీజన్లో మన ఇంట్లో లభించే పదార్ధాలతోనే ఇమ్యూనిటీని మెరుగుపరుచుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అందరి ఇండ్లలో కిచెన్‌లో దొరికే దాల్చిన చెక్క ఈ సీజన్లో వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. దాల్చిన చెక్క, అల్లం టీ మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది. దాల్చిన చెక్క, అల్లం రెండింటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో వర్షాకాలంలో ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది.
ఈ టీని రోజూ తీసుకోవడం ద్వారా మనలో రోగనిరోధక వ్యవస్ధ మెరుగవుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇక దాల్చిన చెక్క, థైమ్ టీ వర్షాకాలంలో సిప్ చేసేందుకు మేలైన ప్రత్యామ్నాయం. ఈ టీ తీసుకోవడం ద్వారా గొంతు నొప్పి మటుమాయం కావడంతో పాటు హానికారక ఇన్ఫెక్షన్స్ను దీటుగా ఎదుర్కొంటుంది. ఈ టీ తీసుకుంటే జలుబు, దగ్గును కూడా నివారించవచ్చు. ఇక వర్షాకాలంలో దాల్చినచెక్కతో చేసిన ఈ పానీయాలను ట్రై చేయండి..
దాల్చిన చెక్క, అల్లం టీ
దాల్చిన చెక్క గ్రీన్ టీ
దాల్చిన చెక్క పాలు
దాల్చిన చెక్క, హనీ వాటర్
దాల్చిన చెక్క, థైమ్ టీ
Read More :
SRSP project | ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

