Rohit Sharma : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) పరుగుల వీరుడిగానే కాదు ఫిట్నెస్ ఐకాన్‌గానూ ఎందరికో స్ఫూర్తి. రెండేండ్ల క్రితం మునపటి ఫామ్ అందుకున్న కింగ్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో రికార్డలు బద్ధలు కొడుతూ వస్తున్నాడు. మైదానంలో దూకుడుగా, మైదానం అవతల ప్రశాంతంగా కనిపించే విరాట్ అశేష అభిమానగణాన్ని సొంతం చేసుకున్నాడు. టీమిండియాలోనే అతడికి బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కుర్రాళ్లకు విలువైన సలహా ఇచ్చాడు.
యంగ్‌స్టర్స్ మొత్తం కోహ్లీని ఆదర్శంగా తీసుకోవాలని హిట్‌మ్యాన్ సూచించాడు. జియో సినిమాలో దినేశ్ కార్తిక్(Dinesh Karthik)తో మాట్లాడిన రోహిత్ ఏం చెప్పాడంటే.. ‘ఇప్పటివరకు ఒక్కసారి కూడా కోహ్లీ నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)కి వెళ్లలేదు. ఫిట్నెస్, ఆటపై అతడికున్న ఇష్టాన్ని అందరూ గమనించాలి. కోహ్లీ కవర్ డ్రైవ్, ఫ్లిక్, కట్ షాట్ ఎలా ఆడతాడు? అని కాకుండా అతడు ఒక నాణ్యమైన బ్యాటర్ ఎదిగిన తీరును అర్ధం చేసకోండి’ అని హిట్‌మ్యాన్ తెలిపాడు. అంతేకాదు జట్టుకోసం ఏదైనా చేసేందుకు విరాట్ సిద్ధంగా ఉంటాడని అన్నాడు.
‘నేను ఎంతో గమనించాను. అతడు సాధించిన రికార్డుల పట్ల ఎంతో సంతృప్తిగా ఉంటాడు. జట్టు కోసం అతడు ఎప్పుడూ ముందుంటాడు. పరుగుల సాధించాలనే ఆకలి, జట్టు కోసం దేనికైనా సిద్ధపడడం వంటి గుణాలు స్వతహాగా రావాలి. అందుకని సీనియర్లను, మీ తోటివాళ్లను గమనించాలి’ అని యువ క్రికెటర్లకు రోహిత్ సందేశమిచ్చాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్.. మూడో మ్యాచ్‌కు జట్టుతో కలువనున్నాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 15న మూడో టెస్టు రాజ్‌కోట్‌లో జరుగనుంది.