– బి. శాంతకుమారి, కోదాడ
ఎకరాల కొద్దీ భూమి ఉన్నప్పుడు రోడ్లు తప్పనిసరిగా అవసరం అవుతాయి కదా! పైగా పండే పంటలను తరలించడానికి వ్యాన్లు, లారీలు వస్తుంటాయి. అందుకైనా రోడ్లు కావాలి. వ్యవసాయ భూమిలో ప్రధానంగా తూర్పు-పడమరను కలిపే పెద్ద రోడ్డు ఒకటి వేయాలి. లేదా దక్షిణం-ఉత్తరం కలిపే ముఖ్యమైన పెద్ద రోడ్డు వేసుకోవాలి. అంతేకాదు.. ఈ నాలుగు దిశలు అనుసంధానం అయ్యేలా.. ప్లస్ ఆకారంలో రోడ్లు వేయడం చాలా ఉపయుక్తం.
మన వ్యవసాయ భూమి మరింత విస్తరించినప్పుడు.. ఆ వ్యవసాయక్షేత్రం వందల ఎకరాలకు చేరినప్పుడు.. ఆ క్షేత్రం చుట్టూ పది లేదా ఏడు అడుగుల ప్రదక్షిణపూర్వక పాత్వే ఉండటం మరీ మంచిది. పనివాళ్లు అన్నిచోట్లకూ వెళ్లి, అన్ని మూలల నుంచీ పండిన పంటలను తీసుకొని ప్రధాన వీధులకు చేర్చవచ్చు. అయితే, ప్లస్ ఆకారం రోడ్లు దిశలకు విధిగా ఏమాత్రం వంకర లేకుండా వేయాలి.
– కె. శ్రీనివాస్, చౌటుప్పల్
గృహం.. తల్లి గర్భకోశం లాంటిది. సాధారణంగా అందులో చేరిన జీవి.. అసాధారణ శక్తియుక్తులతో, అందులోంచి ఆవిర్భవిస్తాడు. ఏ మహావ్యక్తి అయినా పుట్టుకతోనే గొప్పవాడు కాలేడు. ప్రతి వ్యక్తికీ అంతర్లీనంగా ప్రజ్ఞ ఉన్నా.. ప్రధానంగా పరిసరాలు – ప్రకృతి అతణ్ని ప్రభావితం చేస్తాయి. అందుకే, శాస్ర్తాలు వర్ధిల్లుతున్నాయి. గురువులు మనదేశంలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నారు. చెక్కిన తరువాతనే వెదురు వేణువు అవుతుంది. మట్టి ముద్దను కాల్చితేనే ప్రమిదగా మారుతుంది.
ఉన్నది ఉన్నట్టుగా ఇంటి స్థలాన్ని వాడుకుంటే.. వేడుక ఉండదు. వేదన తప్ప! స్థలాన్ని తప్పకుండా దిశానుకూలంగా స్థిరీకరించుకోవాలి. స్థలం మెట్నకు కుదిరాక.. ప్రాకారాలు కూడా దిశకు క్రమబద్ధీకరించాలి. స్థలం – కాంపౌండ్ సెట్ చేశాక.. ఆ స్థలాన్ని గుణించి, అందులో ఇంటి నిర్మాణం చేయాలి. కాదు.. జాగను బట్టే ఇల్లు కడతామంటే, ఇసుక చెరగని బియ్యంతో దేవుడికి నైవేద్యం వండినట్టు అవుతుంది. మరోలా ఆలోచించకుండా, పెరిగిన ఆగ్నేయాన్ని కట్చేసి, శాస్త్రబద్ధంగా ఇల్లు కట్టండి. శుభం కలుగుతుంది.
– కె. రమేశ్, జోగిపేట
స్థలం మధ్యలోంచి నీటి కాలువ లేదా నాలా (చిన్నది) పోతున్నప్పుడు.. మనం రెండు అంశాల గురించి ఆలోచించాలి. ఒకటి ఆ నీటి కాలువను మన స్థలం మొత్తానికి తూర్పు దిశ వైపునకు మార్చడం. రెండోది నాలాను అలాగే ఉంచి, దానికి దక్షిణంవైపు లేదా పశ్చిమంవైపు ఇల్లు ప్లాను చేసుకోవడం. మీ స్థలానికి రోడ్డు ఎటు వైపు ఉందో చెప్పలేదు.
ఆ స్థలానికి దక్షిణం రోడ్డు ఉండి, దాని మధ్యగుండా నీటి కాలువ పోతూ ఉంటే.. మీరు పడమర దిశలో, ఆ కాలువను తూర్పు వైపునకు వచ్చేలా ఇల్లు కట్టాలి. లేదు తూర్పు రోడ్డు ఉండి, మధ్యలోంచి కాలువ పోయినా.. ముందుభాగం వదిలి, నాలాకు పడమరలో ఇల్లు కట్టాలి. అప్పుడు తూర్పు భాగం ఖాళీగా ఉంటుంది. అది శుభకరం. లేదూ.. ముందు చెప్పినట్టు నాలాను జరిపి, అటు ఉత్తరం పారునుంచి లేదా తూర్పు అంచునుంచి నాలా మార్చి, మొత్తం స్థలం వాడుకోవచ్చు.
– బి. దశరథ, ఖమ్మం
ఇంటి ద్వారాలు.. అంటే, ఆగమన-నిష్క్రమణ ద్వారాలు గుండుదారానికి, దిశకు పొందికగా ఉండటం చాలా ముఖ్యం. ద్వారాలు వంకరగా ఉన్నాయీ అంటే.. మీ ఇంటి గోడలు వంకరగా కట్టారని అర్థం. ఇది చాలా దోషం. పశ్చిమభాగంలో ఉండే ద్వారం వంకరగా అటు వాయవ్యం చూసినా, నైరుతిని చూసినా.. దీర్ఘవ్యాధులు, కోర్టు సమస్యలు, ఆర్థిక పరమైన నష్టాలు వస్తాయి.
అంతేకాదు.. అకాల మరణాలు సంభవించే అవకాశాలూ ఉంటాయి. ముందు మీరు ద్వారాలను కాదు.. ఇంటి మొత్తాన్ని కొలిచి, గోడలు సమానంగా సరిచేయాలి. గదిలో కొలతలు – మూలమట్టానికి ఉండేలా చేసుకొని, అప్పుడు ఆ గదులకు ద్వారాలు పెడితే.. ఆ దోషం పోతుంది. ఇలాంటి ఇంటి విషయంలో నిర్లక్ష్యం మంచిదికాదు. త్వరగా బాగుచేసుకోండి.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678