Rohit Sharma : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శిఖర్ ధావన్(Shikhar Dhawan) భారత్‌కు ఆడిన గొప్ప ఓపెనర్లలో ఒకడు. మైదానంలో తను హుషారుతనంతో సహచరులను నవ్వించే గబ్బర్ అంటే అందరికీ అభిమానమే. అందుకనే అతడి రిటైర్మెంట్ ప్రకటన రాగానే అంతా తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వెటరన్ ధావన్‌తో తన ప్రత్యేక బంధాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించాడు.
‘గదులు పంచుకోవడంతో పాటు మైదానంలో జీవితకాల జ్ఞాపకాలను పంచుకున్నాం. అవతలి ఎండ్‌లో ఉండి నువ్వు నా పనిని ప్రతిసారి తేలిక చేసేవాడివి. నువ్వొక అల్టిమేట్ జాట్’ అని హిట్‌మ్యాన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
From sharing rooms to sharing lifetime memories on the field. You always made my job easier from the other end. THE ULTIMATE JATT. @SDhawan25 pic.twitter.com/ROFwAHgpuo
— Rohit Sharma (@ImRo45) August 25, 2024
ఐసీసీ టోర్నీల హీరోగా పేరొందిన ధావన్ టీమిండియాకు దొరికిన ఓ ఆణిముత్యం. తన దూకుడైన ఆటతో గబ్బర్ విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడుతూ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేవాడు. అందుకే భారత జట్టుకు ఆడిన అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడిగా ధావన్ పేరు సంపాదించాడు. రోహిత్ శర్మతో కలిసి ఈ లెఫ్ట్ హ్యాండర్ 2013 నుంచి 2022 వరకూ ఇన్నింగ్స్ ఆరంభించాడు.
వీళ్లిద్దరూ 115 ఇన్నింగ్స్‌లో 5,148 పరుగులు సాధించారు. దాంతో, టీమిండియా తరఫున అత్యధిక రన్స్ చేసిన రెండో ఓపెనింగ్ జోడీగా రికార్డు నెలకొల్పారు. లెజెండరీ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీలు వీళ్లకంటే ముందున్నారు.
మైదానంలో తన సూపర్ ఆటతో అదరగొట్టిన ధావన్ వైవాహిక జీవితంలో మాత్రం ఫ్లాప్ అయ్యాడు. అతడు అయేషా ముఖర్జీను 2012 అక్టోబర్‌లో పెండ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు మొదటి భర్తతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2021లో అయేషా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ధావన్‌తో విడాకుల విషయాన్ని వెల్లడించింది. ఈమధ్యే ఫ్యామిలీ కోర్టు ఇద్దరికీ విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం అయేషా ఆస్ట్రేలియాలో ఉంటోంది. జొరావర్ కూడా ఆమెతో పాటు అక్కడే ఉంటున్నాడు.