చిట్యాల, జనవరి 7: మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో చిట్యాల మున్సిపాలిటీని గెలుచుకొని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన ఖమ్మం వెళుతూ మార్గం మధ్యలో ఉన్న చిట్యాలలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్కు ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో అందరూ సమిష్టిగా కృషి చేసి బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జడల ఆది మల్లయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య, మండల ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, నాయకులు మెండె సైదులు, దేవరపల్లి సత్తిరెడ్డి, కొలను వెంకటేశం, కొలను సతీష్, కన్నెబోయిన బలరాం, రామచంద్రం, ఆగు అశోక్, ప్రవీణ్, ఆవుల ఆనంద్, సైదులు, తదితరులు పాల్గొన్నారు.
మోతె, జనవరి 7: ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మోతె మండలం మా మిళ్లగూడెం టోల్ ప్లాజా వద్ద బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ కార్యకర్తలతో కలిసి గ్రామాల్లోని సమస్యలతో పాటు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల సాధనకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.