చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలను రేపే నిర్వహించాలని ఆ రాష్ట్ర మాజీ హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనిల్ విజ్ (Anil Vij ) అన్నారు. తమ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని తెలిపారు. వరుస సెలవుల నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని ఈసీని బీజేపీ కోరింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ నేపథ్యంలో అనిల్ విజ్ ఆదివారం స్పందించారు. ప్రకటించిన ఎన్నికల తేదీ వరుస సెలవుల తర్వాత ఉండటంతో ఓటర్ల సంఖ్యను తగ్గిస్తుందని మీడియాతో అన్నారు. ‘కాంగ్రెస్ ఈ రోజు స్పందించింది. కానీ ఎన్నికల పొడిగింపు కోసం మేం అడగడం లేదు. సుదీర్ఘ సెలవు కాలాన్ని నివారించడానికి ఎన్నికల తేదీని కొన్ని రోజులు వెనక్కి జరుపాలని మేం సూచిస్తున్నాం. ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నాం. రేపు నిర్వహించినా మా పార్టీ సిద్ధంగా ఉంది’ అని అన్నారు.
కాగా, బీజేపీ ఇటీవల రెండు రోజుల పాటు మారథాన్ సమావేశాన్ని నిర్వహించిందని అనిల్ విజ్ తెలిపారు. 90 అసెంబ్లీ స్థానాల్లో పోటీ కోసం ప్రతి స్థానం నుంచి ముగ్గురు లేదా నలుగురు అభ్యర్థుల పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపినట్లు చెప్పారు. రేపే ఎన్నికలు జరిగినా తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. మరోవైపు హర్యానాలో ఒకే దశలో అక్టోబర్ 1న పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 4న ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.
Ambala: Haryana's former Home Minister Anil Vij says, "The declared dates make it possible for people to take extended holidays, which reduces voter turnout. Congress has reacted today, but we are not just asking for an extension. We suggest moving the dates back by a few days to… pic.twitter.com/PLckYZNO42
— IANS (@ians_india) August 25, 2024