హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం చంద్రబాబుతో క్లోజ్డ్ డోర్లో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించానని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని తేలిపోయింది. రాయలసీమ లిఫ్ట్ పనులు 2020లోనే నిలిచిపోయాయని ఏపీసీఎం చంద్రబాబు స్పష్టతనిచ్చారు. పోలవరం ప్రాజెక్టును బుధవారం పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల నీళ్లపై నడుస్తున్న రాజకీయాలు తనకు అర్థం కావడం లేదని అన్నారు. గోదావరిపై దేవాదుల ప్రాజెక్టు ఉందని అక్కడి నుంచి నీళ్లు పోలవరానికి వస్తాయని తెలిపారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని.. కాస్త ముందుకెళ్లి తాను ఇవే నీళ్లను రాయలసీమకు తరలిస్తే తెలంగాణకు కూడా నీళ్లు ఇవ్వొచ్చు అంటూ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, ఒక అబద్ధాన్ని వందసార్లు చె;ohs నిజమైపోతుందా? అlr మండిపడ్డారు. 5-5-2000 తేదీన జీవో నెంబర్ 203 ప్రకారం రూ.3,805 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేషన్ మంజూరీ ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణకు చెందిన ఒకరు 15-5-2020లో నేషనల్ గ్రీన్ట్రిబ్యూనల్(ఎన్జీటీ)కి వెళ్లారని తెలిపారు. 20-5-2020లో అదే వ్యక్తి ప్రాజెక్టుకు షీజిబిలిటీ రిపోర్టు, అనుమతులు ఉన్నాయా..? ఉంటే అందించాలని కోరినట్టు వెల్లడించారు. అవి ఇచ్చేవరకు ఎన్జీటీ స్టే ఇచ్చిందని చెప్పారు. 29-10-2020న పర్యావరణ అనుమతులు తీసుకోలేదని పనులు నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశించిందని చంద్రబాబు స్పష్టంచేశారు. 22-03-2024లో డీపీఆర్ లేకుండా పనులు ఎలా చేశారని గత ప్రభుత్వంపై ఎన్జీటీ రూ.2.60 కోట్ల జరిమానా వేసిందని గుర్తుచేశారు. వాస్తవాలు ఇలా ఉంటే చిల్లర రాజకీయాలు చేయడం ఏమిటని మండిపడ్డారు. చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయంటూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మైలేజీ కోసం చేసిన ప్లాన్ బెడిసికొట్టినట్టయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.