IND vs SL : తొలి వన్డేలో అర్ద శతకంతో చెలరేగిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ (63) మళ్లీ యాభై కొట్టాడు. ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక (Srilanka) నిర్దేశించిన మోస్తరు ఛేదనలో హిట్‌మ్యాన్ శివాలెత్తిపోయాడు. లంక బౌలర్లను ఉతికేస్తూ వరుసగా రెండో ఫిఫ్టీతో గర్జించాడు. కమింద్ మెండిస్ వేసిన 10వ ఓవర్ నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచిన రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
వన్డే మ్యాచ్ పవర్ ప్లేలో రోహిత్ అర్ధ శతకం బాదడం ఇది నాలుగో సారి. టీమిండియా పవర్ ప్లేలో 76 పరుగులు చేసింది. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(30) సైతం దంచుకున్నాడు. వీళ్లిద్దరి విధ్వంసంతో భారత్ లక్ష్యాన్ని కరిగిస్తోంది. ప్రస్తుతం స్కోర్.. 95-0.
Rohit Sharma & Shubman Gill bring up their 16th 50+ partnership in just 24 ODI innings 👏https://t.co/lUbBOz1QL8 | #INDvSL pic.twitter.com/fxzHOfJ6Od
— ESPNcricinfo (@ESPNcricinfo) August 4, 2024
టాస్ గెలిచిన శ్రీలంక రెండో వన్డేలో పోరాడగలిగే స్కోర్ చేసింది. ఓ దశలో భారత బౌలర్ల ధాటికి రెండొందల లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించిన లంక 240 రన్స్ కొట్టింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(40), కమిందు మెండిస్(40) రాణించగా.. గత మ్యాచ్ హీరో దునిత్ వెల్లలాగే(39) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో, ఆతిథ్య జట్టు భారత్‌కు మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.