Riyan Parag : ఐపీఎల్ 16వ సీజన్లో దారుణంగా విఫలమైన రియాన్ పరాగ్(Riyan Parag) రంజీ ట్రోఫీలో మెరుపు సెంచరీ బాదాడు. ఎలైట్ గ్రూప్ బిలో అస్సాం(Assam) కెప్టెన్‌గా బరిలోకి దిగిన పరాగ్ కేవలం 56 బంతుల్లోనే శతకం సాధించాడు. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ విధ్వంసక బ్యాటర్ 14 పోర్లు, 12 సిక్సర్లతో వందకు చేరువయ్యాడు.
ఫాలో ఆన్‌లో ప్రమాదంలో పడి రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జట్టును పరాగ్ సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 87 బంతుల్లో అతడు 155 రన్స్ కొట్టినా.. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో దాంతో 254 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన ఛత్తీస్‌గఢ్ లంచ్ సమయానికి వికెట్ కోల్పోకుండా 52 పరుగులు చేసింది. ఆ జట్టు మరో 35 రన్స్ కొడితే విజేతగా నిలుస్తుంది.
11 fours, 12 sixes – They call him Assam’s wonderboy for a reason. 🫡💗 pic.twitter.com/2pUFmMnl0A
— Rajasthan Royals (@rajasthanroyals) January 8, 2024
మొదట బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌గఢ్ తొలి ఇన్నింగ్స్‌లో 327 రన్స్ కొట్టింది. కెప్టెన్ అమన్‌దీప్ ఖరే(116) సెంచరీతో కదం తొక్కగా.. శశాంక్ సింగ్(82), అశుతోష్(58) అర్ధ సెంచరీతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అస్సాం ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. సౌరభ్ మజుందార్ 5 వికెట్లతో విజృంభించడంతో 159 పరుగులకే ఆలౌటయ్యింది. పరాగ్ సెంచరీతో పోరాడినప్పటికీ మిగతావాళ్లు చేతులెత్తేశారు. దాంతో, ఛత్తీస్‌గఢ్‌కు 87 పరుగుల స్వల్ప టార్గెట్ నిర్దేశించింది.