Kubeer Mandal| కుభీర్, డిసెంబర్ 24: నిర్మల్ జిల్లా కుభీర్ మండల సర్పంచుల సంఘం కార్యవర్గాన్ని ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచులు బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కుభీర్‌లోని తపస్వి డిగ్రీ కళాశాలలో జరిగిన సర్పంచుల సమావేశంలో గౌరవ అధ్యక్షుడిగా డీఎన్టీ గ్రామ సర్పంచ్ జాదవ్ సునీత, అధ్యక్షుడిగా ధార్ కుభీర్ గ్రామ సర్పంచ్ తోకల మారుతి, ఉపాధ్యక్షులుగా నిగ్వా గ్రామ సర్పంచ్, (బీఆర్ఎస్) మండల నాయకుడు మెంచు రమేష్, ప్రధాన కార్యదర్శిగా సిర్పెల్లి (హెచ్) సర్పంచ్ ఆరెపల్లి సతీష్, సహాయ కార్యదర్శిగా బెల్గాం గ్రామ సర్పంచ్ నిస్తుర్ గోవర్ధన్, కోశాధికారిగా గోడపూర్ సర్పంచ్ మోరే పల్లవి, సోషల్ మీడియా కన్వీనర్ గా సాంవ్లీ సర్పంచ్ గాడేకర్ లక్ష్మణ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం ఎంపీడీఓ సాగర్ రెడ్డిని కలిసి కార్యవర్గ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు తోకల మారుతి మాట్లాడుతూ.. సర్పంచుల సమస్యలపై అందుబాటులో ఉండి పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు మండల నాయకులు, అధికారులు కార్యవర్గ సభ్యులను సత్కరించారు.

Dhurandhar | ‘ధురంధర్’ కలెక్షన్లపై పాక్ ప్రజల వింత డిమాండ్.. కలెక్షన్స్‌లో మాకు వాటా ఇవ్వాలి..
Nani | నాని ‘ది ప్యారడైజ్’లో డ్రాగన్ బ్యూటీ.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
Karate Kalyani | హీరోయిన్ల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు.. కరాటే కల్యాణి ఊహించని స్పందన