Carrot Juice | మనం ఆహారంగా తీసుకునే కూరగాయలల్లో క్యారెట్స్ కూడా ఒకటి. ఇవి నారింజ రంగుతో పాటు తెలుపు, పసుపు, ఊదా, ఎరుపు రంగుల్లో కూడా లభిస్తూ ఉంటాయి. ఇవి తియ్యటి రుచిని కలిగి ఉంటాయి. క్యారెట్స్ ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో బీటా కెరోటీన్ తో పాటు ఫైబర్, విటమిన్ కె1, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కొవ్వు, కేలరీలను ఇవి తక్కువగా కలిగి ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. క్యారెట్ లను మనం ఆహారంలో భాగంగా తరచూ తీసుకుంటూ ఉంటాము. క్యారెట్ లను వంటలల్లో వాడడంతో పాటు వీటిని జ్యూస్ గా చేసి ఉదయం పూట అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అల్పాహారంలో భాగంగా క్యారెట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
క్యారెట్ లు బీటా కెరోటీన్ ను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఈ బీటా కెరోటీన్ మన శరీరంలోకి ప్రవేశించిన తరువాత ఇది విటమిన్ ఎ మార్చబడుతుంది. విటమిన్ ఎ మన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. క్యారెట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల దృష్టి లోపాలు తగ్గుతాయి. క్యారెట్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. తద్వారా శరీరం ఇన్పెక్షన్ లబారిన పడే అవకాశాలు తగ్గుతాయి. అల్పాహారంలో క్యారెట్ జ్యూస్ ను చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్యారెట్ లలో పొటాషియం, విటమిన్ కె వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. క్యారెట్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడతాయి. దీంతో వృద్దాప్య ఛాయలు తగ్గుతాయి. చర్మంపై మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా క్యారెట్ జ్యూస్ మనకు సహాయపడుతుంది. క్యారెట్ జ్యూస్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మలబద్దకాన్ని తగ్గించడంలో దోహదపడుతుంది. ఇక క్యారెట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాలేయంలో ఉండే వ్యర్థాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. ఉదయం పూట అల్పాహారంలో భాగంగా క్యారెట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. క్యారెట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఇవి మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. దీంతో మెదడు ఆరోగ్యంతో పాటు అభిజ్ఞా పనితీరు కూడా మెరుగుపడుతుంది. దంతాలు, చిగుళ్ల సమస్యతో బాధపడే వారు క్యారెట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ జ్యూస్ లో క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి దంతాలను దృఢంగా చేయడంతో పాటు చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.
బరువు తగ్గాలనుకునే వారు క్యారెట్ జ్యూస్ ను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యారెట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు క్యారెట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. ఇక ప్రాణాంతకమైన క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో కూడా క్యారెట్ మనకు దోహదపడుతుంది. క్యారెట్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి. ఈ విధంగా క్యారెట్ జ్యూస్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని నేరుగా తీసుకోవడంతో పాటు ఈ క్యారెట్ లకు పాలకూర, అల్లం, ఆపిల్ వంటి వాటిని కలిపి జ్యూస్ గా చేసి కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా చలికాలంలో ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.