HanuMan | రామ మందిరానికి ‘హనుమాన్’ చిత్ర బృందం విరాళం.. ప్రతి టికెట్‌పై 5 రూపాయలు
HanuMan | రామ మందిరం ప్రారంభోత్సవం వేళ ‘హనుమాన్’ (HanuMan) చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. ‘హనుమాన్’ సినిమా ప్రతి టికెట్‌పై ఐదు రూపాయలను రామ మందిరానికి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
HanuMan | రామ మందిరం ప్రారంభోత్సవం వేళ ‘హనుమాన్’ (HanuMan) చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. ‘హనుమాన్’ సినిమా ప్రతి టికెట్‌పై ఐదు రూపాయలను రామ మందిరానికి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తేజ సజ్జ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా.. జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో భాగంగానే ఈ సినిమా ప్రతి టికెట్‌పై 5 రూపాయలను రామ మందిరానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది. చిత్ర బృందం నిర్ణయాన్ని ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు.
యావత్ ప్రజానీకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఉత్తరప్రదేశ్ (UP) లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతోంది. జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు ఓ వైపు చకాచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా కడుతున్న భవ్య రామ మందిరం నిర్మాణం కోసం పలువురు భక్తులు తమ వంతు సాయం చేస్తూ.. రాముడిపై తమకున్న భక్తిని చాటుకుంటున్నారు. వారికి తోచిన సాయం చేస్తున్నారు. డబ్బు, వస్తు రూపంలో కానుకలు అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే రామ మందిరం ప్రారంబోత్సవం వేళ ‘హనుమాన్’ చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విరాళం ప్రకటించింది.
జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు జనవరి 16న ప్రారంభమవుతాయి. ఆలయ గర్భగుడిలో రాముని విగ్రహ ప్రతిష్ఠను 22వ తేదీ మధ్యాహ్నం 12.45-1.00 గంటల మధ్య నిర్వహించనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి దేశంలోని పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు అందాయి. సినీ ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, అలియా భట్, దీపికా పదుకొణె సహా పలువురు స్టార్స్‌కు ఆహ్వానాలు అందాయి. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లనున్నట్లు చిరంజీవి ప్రకటించారు. మరోవైపు ఆలయ ప్రారంభోత్సవానికి దేశవిదేశాల నుంచి సుమారు 7వేల మంది హాజరవుతారని అంచనా.
Also Read..
Chiranjeevi | రామాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది.. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తా : చిరంజీవి
Cold Wave | ఢిల్లీ గజగజ.. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు.. మరో రెండు రోజుల్లో పెరగనున్న చలితీవ్రత
Coronavirus | 24 గంటల్లో 600కు పైనే కొత్త కేసులు.. నాలుగు మరణాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

