Coronavirus | భారత్లో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 605 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) సోమవారం వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,50,18,792కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 4,002 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలో 648 మంది కోలుకున్నారు. దీంతో మహమ్మారి నుంచి ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 44,481,341కి పెరిగింది. నిన్న ఒక్కరోజే నాలుగు మరణాలు నమోదయ్యాయి. కేరళలో ఇద్దరు, కర్ణాటక, త్రిపురలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో దేశంలో కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,396కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 0.01 శాతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.81 శాతం కాగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 220.67 కోట్ల (220,67,81,656) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
Also Read..
Cold Wave | ఢిల్లీ గజగజ.. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు.. మరో రెండు రోజుల్లో పెరగనున్న చలితీవ్రత
Yash | యశ్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. బ్యానర్ కడుతూ ముగ్గురు అభిమానులు మృతి
Chiranjeevi | రామాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది.. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తా : చిరంజీవి