Yash | యశ్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. బ్యానర్ కడుతూ ముగ్గురు అభిమానులు మృతి
Yash | ప్రముఖ కన్నడ నటుడు యశ్ (Kannada actor Yash) బర్త్ డే (birthday) వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. యశ్ నేడు 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బ్యానర్ (banner) ఏర్పాటు చేస్తూ విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు.
Yash | ప్రముఖ కన్నడ నటుడు యశ్ (Kannada actor Yash) బర్త్ డే (birthday) వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. యశ్ నేడు 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక (Karnataka)లోని గడగ్ (Gadag) జిల్లాలో కొందరు అభిమానులు నటుడి బ్యానర్ (banner) ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
కాగా, యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. 2007లో ‘జంబడ హుడుగి’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ‘రాకీ’ (2008), ‘గూగ్లీ’ (2013), ‘మిస్టర్ అండ్ మిస్ రామాచారి’ (2014) సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ స్థానం సంపాదించుకున్నాడు. ఇక ‘కేజీఎఫ్’ సిరీస్‌తో ఏకంగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. యశ్ ప్రస్తుతం ‘టాక్సిక్’ (Toxic) అనే చిత్రంలో నటిస్తున్నారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు సమాచారం. ‘కేజీఎఫ్’ లాంటి భారీ హిట్ తర్వాత యశ్ నటిస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Also Read..
Chiranjeevi | రామాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది.. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తా : చిరంజీవి
Drug Addict | ప్రపంచ కుబేరుడైనా డ్రగ్స్‌కు బానిసే.. అతనెవరంటే?
Deepti Sharma | టీ20ల్లో అరుదైన ఫీట్.. తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన దీప్తి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Baththa Out on Netflix | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన సినిమా!
Katrina Kaif | ‘బౌన్స్ బ్యాక్ అవ్వాలా? ఎందుకు?’.. ట్రోలింగ్‌కు కత్రినా కైఫ్ గట్టి సమాధానం!
Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
Srikanth Odela | ‘ది ప్యారడైజ్’ విమర్శలు.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీపై ఆసక్తికర చర్చ!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

