Drug Addict | ప్రపంచ కుబేరుడైనా డ్రగ్స్‌కు బానిసే.. అతనెవరంటే?
మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు కెటామైన్ లాంటి సైకెడెలిక్ డ్రగ్స్‌ను వినియోగిస్తూ గత ఏడాది వార్తలకెక్కిన ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధిపతి ఎలాన్ మస్క్ ఇప్పటికీ మాదకద్రవ్యాల వ్యసనాన్ని మానలేదని తెలుస్తున్నది.
- మాదకద్రవ్యాల వ్యసనాన్ని మానుకోని మస్క్
Drug Addict | ఆస్టిన్ (అమెరికా), జనవరి 7: మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు కెటామైన్ లాంటి సైకెడెలిక్ డ్రగ్స్‌ను వినియోగిస్తూ గత ఏడాది వార్తలకెక్కిన ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధిపతి ఎలాన్ మస్క్ ఇప్పటికీ మాదకద్రవ్యాల వ్యసనాన్ని మానలేదని తెలుస్తున్నది. దీని వల్ల మస్క్ ఆరోగ్యంతోపాటు ఆయన వ్యాపార సామ్రాజ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతున్నదని ఆ సంస్థల డైరెక్టర్ల బోర్డు సభ్యులు ఆందోళన చెందుతున్నట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ పత్రిక వెల్లడించింది.
కెటామైన్ లాంటి సైకెడెలిక్ డ్రగ్‌ను వాడేందుకు ప్రిస్క్రిప్షన్‌ను కలిగి ఉన్నట్టు స్వయంగా చెప్తున్న ఎలాన్ మస్క్ గతంలో బహిరంగంగానే మారిజువానాను సేవించిన ఉదంతాలున్నాయి. 2017లో ఓ ఈవెంట్‌కు ఆలస్యంగా వచ్చిన మస్క్.. మాదకద్రవ్యాల మత్తులో బూతులు మాట్లాడారు. అనంతరం పలు సందర్భాల్లో కూడా మస్క్ డ్రగ్స్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని మస్క్ అటార్నీ అలెక్స్ స్పైరో తోసిపుచ్చారు. మస్క్‌కు తరచుగా డ్రగ్ పరీక్షలు జరుగుతున్నాయని, ఆ టెస్టుల్లో ఆయన ఎప్పుడూ విఫలమవలేదని స్పైరో చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- drug addict
- Durgs
- Elon Musk
- SpaceX
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

