IPL 2024 : భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) పునరామనంపై నెలకొన్న పలు సందేహాలకు తెర పడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్(IPL 2024)లో పంత్ బరిలోకి దిగుతున్నాడు. అవును.. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కెప్టెన్‌గా ఫ్యాన్స్‌ను అలరించేందకు పంత్‌కు లైన్ క్లియర్ అయింది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA) వైద్య బృందం ఈ డాషింగ్ బ్యాటర్‌కు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చింది.
దాంతో, పంత్ రీ-ఎంట్రీకి ఉన్న ఏకైక అడ్డంకి కూడా తొలగిపోయింది. త్వరలోనే అతడు వైజాగ్‌లో జరిగే ఢిల్లీ ప్రీ-క్యాంప్‌లో జట్టుతో కలువనున్నాడు. 17వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి రెండు మ్యాచ్‌లను విశాఖపట్టణంలో ఆడనున్న విషయం తెలిసిందే. రెండేండ్ల క్రితం కారు యాక్సిడెంట్లో మృత్యుంజయుడిగా బయటపడిన పంత్ మోకాలి సర్జరీ(Knee Surgery) చేయించుకున్నాడు. అనంతరం ఎన్సీఏలో రీహాబిలిటేషన్‌లో ఉన్న అతడు కష్టమైన వ్యాయామాలు చేసి ఫిట్నెస్ సాధించాడు. నెట్స్‌లో బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ చెమటలు చిందించాడు.
Pushing the limits 💪#RP17 pic.twitter.com/XyDmSWic3H
— Rishabh Pant (@RishabhPant17) February 27, 2024
దాంతో, ఐపీఎల్ 17వ సీజన్లో ఢిల్లీ సారథిగా పంత్ రీ- ఎంట్రీ ఇస్తాడని మెంటార్ సౌరభ్ గంగూలీ, హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌లు సైతం చెప్పేశారు. అయితే.. ఈసారి పంత్ మునపటిలా వికెట్ కీపర్, బ్యాటర్‌గా ఆడడం కష్టమే. అతడిపై ఎక్కువ పడకుండా వికెట్ కీపింగ్ బాధ్యతలు వేరేవాళ్లకు అప్పగించే చాన్స్ ఉంది. మార్చి 22న ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభం కానుంది. తొలి పోరులో ఢిల్లీ జట్టు మార్చి 23న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
A journey nothing short of inspiration! 🙌🏻@RishabhPant17 remembers the struggles he went through in his initial cricketing days, emphasising on how his passion for Cricket kept him motivated! 💪🏻
Don’t miss #IPLonStar – STARTS 22ND MARCH pic.twitter.com/EGRhbDZb1i
— Star Sports (@StarSportsIndia) March 1, 2024
పంత్ కెప్టెన్సీలో ఢిల్లీ 14వ సీజన్లో ఫైనల్‌కు చేరింది. అయితే.. అనూహ్యంగా ముంబై చేతిలో ఓటమిపాలైంది. నిరుడు అతడి గైర్హాజరీలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) ఢిల్లీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడు అద్భుతంగా రాణించినా.. ఓపెనర్ పృథ్వీ షా, మిచెల్ మార్ష్, మనీశ్ పాండేలు దారుణంగా విఫలమయ్యారు.
దాంతో, వరుస ఓటములతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడింది. చివర్లో ఫిలిఫ్ సాల్ట్ మెరుపు ఇన్నింగ్స్‌లతో రెండు మ్యాచులు గెలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు పంత్ రాకతో ఢిల్లీ జట్టులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దూకుడుకు మారుపేరైన పంత్.. ఈ సీజన్లో జట్టును గాడిలో పెడతాడని మేనేజ్మెంట్ అతడిపై గంపెడు ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తే మ్యాచ్ స్వరూపాన్నిమార్చేయగల పంత్ ఐపీఎల్లో దంచికొడతే.. ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో ఆడే చాన్స్ ఉందని ఫ్యాన్స్ సంబురపడుతున్నారు.