Pakistan | పాకిస్థాన్ 14వ అధ్యక్షుడి (14th president of Pakistan)గా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సహ చైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Zardari ) ప్రమాణ స్వీకారం చేశారు. ఇస్లామాబాద్ (Islamabad)లోని అధ్యక్ష భవనంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన దేశాధ్యక్ష పదవిని చేపట్టారు. జార్దారీతో పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖాజీ ఫేజ్ ఇసా (Qazi Faez Isa) ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. 68 ఏళ్ల జర్దారీ దేశాధ్యక్ష పదవి చేపట్టడం ఇది రెండోసారి.
శనివారం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో జర్దారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. పీపీపీ, పీఎంఎల్-ఎన్ మద్దతుతో పోటీ చేసిన ఆయన సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ అభ్యర్థి మహమూద్ ఖాన్ అచక్జాయ్ (75)ను ఓడించారు. ఈ ఎన్నికల్లో జర్దారీకి 255 ఓట్లు, మహమూద్‌కు 119 ఓట్లు లభించాయి. దీంతో తదుపరి పాక్ అధ్యక్షుడిగా జర్దారీ బాధ్యతలు చేపట్టారు.
Also Read..
HGCL | హెచ్‌జీసీఎల్‌లో సీఎం ఆఫీస్.. 60 లక్షలతో పనులు చేపట్టిన హెచ్ఎండీఏ
David Miller | ప్రేయసిని పెళ్లాడిన గుజరాత్ హిట్టర్.. కొత్తజంట లవ్‌స్టోరీ తెలుసా..?
NZ vs AUS 2nd Test | అలెక్స్ క్యారీ అద్వితీయ పోరాటం.. టెస్టు సిరీస్ ఆస్ట్రేలియా కైవసం