Oscars 2024 | 50 ఏళ్ల కిందటి సీన్ రిపీట్.. ఆస్కార్ వేదికపైకి నగ్నంగా వచ్చిన నటుడు జాన్ సీనా.. VIDEO
Oscars 2024 | ప్రపంచ సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల (Oscar Awards) వేడుకల్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ నటుడు నగ్నంగా (naked) వేదికపైకి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
Oscars 2024 | ప్రపంచ సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల (Oscar Awards) వేడుక లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరుగుతున్నాయి. 96వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవ వేడుకకు దేశ, విదేశాల నుంచి సినీ తారలు హాజరయ్యారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ నటుడు నగ్నంగా (naked) వేదికపైకి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
ప్రముఖ హాలీవుడ్ నటుడు, రెజ్లర్ జాన్ సీనా (Actor-wrestler John Cena) గురించి హాలీవుడ్ సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పలు యాక్షన్ మూవీల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా 96వ అకాడమీ అవార్డుల వేడుకల్లో ఎవరూ ఊహించని అవతారంలో ఎంట్రీ ఇచ్చాడు. ఒంటి మీద నూలు పోగు లేకుండా ఆస్కార్ వేదికపైకి వచ్చి అందరినీ షాక్‌కు గురి చేశాడు. అంతేకాదు.. ‘బెస్ట్ కాస్ట్యూమ్స్’ (Best Costume Design) విజేతను కూడా ప్రకటించాడు. ‘పూర్ థింగ్స్’ మూవీకి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఆస్కార్ లభించింది.
అయితే సీనా (John Cena)అలా చేయడానికి ఓ కారణం ఉంది. 1974లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. సరిగ్గా 50 ఏళ్ల క్రితం జరిగిన ప్రతిష్ఠాత్మక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎలిజబెత్ టేలర్‌ను వేదికపైకి పిలిచిన సమయంలో ఓ వ్యక్తి నగ్నంగా స్టేజ్ మీదకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రపంచం దృష్టిని ఆకర్షించే ఈ వేడుకల్లో అలాంటి ఘటన అప్పట్లో ఓ సంచలనంగా మారింది. ఇప్పుడు జాన్ సీనా ఇలా నగ్నంగా స్టేజ్‌పైకి వచ్చి మగాడి శరీరం జోక్ కాదు అంటూ ఓ సందేశం ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
John Cena walks onto the #Oscars stage. https://t.co/UNgGySGz3r pic.twitter.com/zPrsl5oiCy
— Variety (@Variety) March 11, 2024
Also Read..
Oppenheimer | సత్తా చాటిన ఓపెన్ హైమర్.. బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టర్ సహా 7 ఆస్కార్ అవార్డులు
Oscars | ఆస్కార్ ఎప్పుడు మొదలైంది.. తొలి ఆస్కార్ విజేత ఎవరు?
Oscar Awards | అట్టహాసంగా ఆస్కార్ వేడుక.. ఓపెన్ హైమర్‌కు అవార్డుల పంట
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

