Rishabh Pant : రెండేండ్ల క్రితం కారు యాక్సిడెంట్ నుంచి మృత్యుంజయుడిగా బయటపడిన రిషభ్ పంత్ (Rishabh Pant) మైదానంలో దుమ్మురేపుతున్నాడు. టీ20ల్లో ఇరగదీసిన ఈ డాషింగ్ బ్యాటర్ చెపాక్ స్టేడియం (Chepauk Stadium)లో శతకంతో మెరిశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఆరో సెంచరీతో లెజెండ్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) సరసన చేరాడు. బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికారేసిన పంత్ శతక గర్జన వెనుక ఓ రహస్యం ఉంది.
మూడోరోజు క్రీజులోకి వచ్చే ముందు పంత్ తన కిట్‌కు ఆయుధ పూజ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెపాక్ స్టేడియంలో పంత్ మెరుపు ఇన్నింగ్స్ అతడిలో మునపటి కసి, దూకుడు ఇంకా చెక్కుచెదరలేదని చాటాయి. ఓవర్‌నైట్ స్కోర్ 12తో మూడోరోజు క్రీజలోకి వచ్చిన పంత్ తుఫాన్‌లా చెలరేగాడు. అయితే.. అంతకంటే ముందు అతడు తన బ్యాట్, గ్లోవ్స్, ఇతర సామగ్రికి పూజ చేశాడు. ‘కారు యాక్సిడెంట్ అనంతరం పునర్జన్మ పొందిన నాకు ఈ మ్యాచ్ చాలా కీలకం.
Pure❤️🙏
Rishabh Pant doing Puja of his bat before going to batting .🤞🏻#RishabhPant #indvsbangladesh #IndVsBan #INDvBAN❤️❤️ pic.twitter.com/lo6ogWKvb7
— priya (@priya74783) September 21, 2024
నా కెరీర్‌ను నిర్ణయించే మ్యాచ్ ఇది. సెంచరీతో తిరిగి వస్తాను.. అందుకు మీ ఆశీర్వాదం కావాలి’ అని పంత్ మనసులో అనుకున్నట్టున్నాడు. ఆ తర్వాత మైదానంలో పంత్ చెలరేగిపోయాడు. శుభ్‌మన్ గిల్(119 నాటౌట్)తో పాటు సెంచరీ బాదేసి ‘వారెవ్వా పంత్.. నువ్వు నిజంగా యోధుడివి’ అంటూ క్రీడా దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాడు.
రిషభ్ పంత్(109), శుభ్‌మన్ గిల్(119 నాటౌట్)
చెపాక్‌లో పంత్ వీరకొట్టుడు కొట్టాడు. టాపార్డర్ కుప్పకూలిన చోట తనలో పరుగుల దాహం తగ్గలేదని చాటుతూ జట్టుకు మరోసారి వెన్నెముకలా నిలిచాడు. 67 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆపద్భాందవుడి పాత్ర పోషించాడు. గిల్ అండగా బంగ్లాదేశ్ బౌలర్లను ఊచకోత కోసిన పంత్ టెస్టుల్లో ఆరో సెంచరీతో గర్జించాడు.
ఇంకేమంది.. టీమిండియా భారీ ఆధిక్యంలో నిలిచింది. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే..? నవంబర్‌లో ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు పంత్ తన మార్క్ షాట్లతో అలరించడంతో భారత జట్టులో ఆనందంలో మునిగిపోయింది. చెపాక్‌లో పంత్ విధ్వంసం చూసిన ఆసీస్ క్రికెటర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని వేరే చెప్పాలా..!