చండీగఢ్: ఒక షాపులో ఉన్న వ్యక్తిని దొంగలు కొట్టారు. కర్రలు, కత్తులతో దాడి చేశారు. కౌంటర్లో ఉన్న డబ్బులు, అతడి మొబైల్ ఫోన్‌ను దోచుకున్నారు. ఆ షాపులోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 18న డునెకే ప్రాంతంలోని స్నేహితుడు షంషేర్ ఖాన్‌ను కలిసేందుకు రాజేష్ కుమార్ అతడి షాపు వద్దకు వెళ్లాడు. అయితే తనకు అత్యవసర పని ఉందని చెప్పిన ఖాన్, రాజేష్‌ను ఆ షాపులో కూర్చొమని చెప్పాడు.
కాగా, కొంత సేపటి తర్వాత ముఖానికి ముసుగులు వేసుకున్న ఐదుగురు వ్యక్తులు రెండు బైకులపై ఆ షాప్ వద్దకు చేరుకున్నారు. షాపులోని క్యాష్ కౌంటర్ వద్ద కూర్చొన్న రాజేష్ కుమార్‌పై కర్రలు, కత్తులతో దాడి చేశారు. వారి దాడి నుంచి తప్పించుకునేందుకు అతడు తీవ్రంగా ప్రయత్నించాడు. చివరకు దొంగలు కౌంటర్లోని క్యాష్, రాజేష్ మొబైల్‌ను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు తీవ్రంగా గాయపడిన రాజేష్‌ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అతడి తలపై 19 కుట్లు పడ్డాయి. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. కాగా, ఆ షాపులోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
“When Rome was burning , Nero was playing flute”
Utterly Disturbing visuals from Moga , serving as one of the countless reminders of the miserable law & order situation of Punjab.
Chief minister @BhagwantMann ji , should saddle up & take proper command of the reins of the state… pic.twitter.com/Hn1XliaVkZ— Parminder Singh Brar (@PSBrarOfficial) September 20, 2024