IND vs NZ 3rd Test : ముంబై టెస్టులో భారత జట్టు కోలుకుంది. అజాజ్ పటేల్(4/43) ధాటికి టాపార్డర్ కుప్పకూలిన వేళ ఓటమి తప్పదా? అనే భయంలో ఉన్న టీమిండియాను రిషభ్ పంత్(53 నాటౌట్) మరోసారి ఆదుకున్నాడు. 29 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన జట్టకు ఆపద్భాందవుడిలా మారి.. వీరోచిత అర్ధ శతకం బాదేశాడు. కివీస్ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొన్న పంత్ జట్టును గెలుపు వాకిట నిలిపాడు. పంత్ మెరుపులతో లంచ్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.
వాంఖడేలో భారత జట్టు పోరాడుతోంది. అజాజ్ పటేల్ తిప్పేయడంతో టాపార్డర్ బ్యాటర్లు డగౌట్ చేరిన వేళ రిషభ్ పంత్(53 నాటౌట్) ఒంటరి యోధుడిలా ఆడుతున్నాడు. క్లీన్‌స్వీప్ తప్పించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్న పంత్ ఏడో అర్ధ శతకంతో భరోసా ఇచ్చాడు. తానొక మ్యాచ్ విన్నర్ అని చాటుతూ కివీస్ స్పిన్నర్ల ఎత్తులను చిత్తు చేస్తూ సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. రవీంద్ర జడేజా(6) ఔటయ్యాక వచ్చిన వాషింగ్టన్ సుందర్(6 నాటౌట్) సమయోచితంగా ఆడి పంత్‌కు సహరించాడు. ఇంకా భారత జట్టు విజయానికి 55 పరుగులు కావాలంతే. లంచ్ తర్వాత ఈ ఇద్దరూ మరో 30 పరుగులు జోడించినా.. అశ్విన్ జట్టును ఆదుకునే అవకాశముంది.
That’s a gritty half-century from Rishabh Pant 👌👌
His 14th FIFTY in Test Cricket 👏👏
Scorecard – https://t.co/KNIvTEyxU7#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank | @RishabhPant17 pic.twitter.com/l8xULaauZM
— BCCI (@BCCI) November 3, 2024
ఓవర్ నైట్ స్కోర్ 171/9తో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ మరో 3 పరుగులకే ఆలౌటయ్యింది. అజాబ్ పటేల్‌ను వెనక్కి పంపిన రవీంద్ర జడేజా(5/55) ఐదో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం 147 పరుగుల ఛేదనకు ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు మ్యాట్ హెన్రీ ఊహించని షాకిచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో మాదిరిగానే మళ్లీ కెప్టెన్ రోహిత్ శర్మ(11)ను పెవిలియన్ పంపి బ్రేకిచ్చాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే అజాజ్ పటేల్ సూపర్ బంతితో శుభ్‌మన్ గిల్(1)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ(1) సైతం డిఫెన్స్ ఆడబోయి స్లిప్‌లో డారిల్ మిచెల్ చేతికి చిక్కాడు.
A fifty that’s as good as a century in incredibly tough conditions 🔥
Rishabh Pant is the only batter today going at better than a run-a-ball in Mumbai 🌟 https://t.co/Vq9uHVazcz | #INDvNZ pic.twitter.com/0a8sIOYLaw
— ESPNcricinfo (@ESPNcricinfo) November 3, 2024
చూస్తుండగానే 3 ముగ్గురు కీలక ఆటగాళ్లు పెవిలియన్ చేరగా.. టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో కుదురుకున్న ఓపెనర్ యశస్వీ జైస్వాల్(5)ను గ్లెన్ ఫిలిఫ్స్ బోల్తా కొట్టించాడు. కష్టకాలలో జట్టును ఆదుకోవాల్సిన సర్ఫరాజ్(1) ఫుల్‌టాస్‌ను ఆడి రచిన్ రవీంద్ర దొరికాడు. అంతే.. 29కే సగం వికెట్లు పడ్డాయి. ఆ దశలో రిషభ్ పంత్(53 నాటౌట్)తో కలిసి రవీంద్ర జడేజా(6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో వికెట్‌కు 42 పరుగులు జోడించిన వీళ్లను అజాజ్ విడదీసి కివీస్‌ను పోటీలోకి తెచ్చాడు.