ముంబై: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ను (CM Yogi Adityanath) చంపేస్తామంటూ ముంబై పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చింది. పది రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని లేదంటే బాబా సిద్ధిఖీలాగా చంపుతామని దుండగులు అందులో హెచ్చరించారు. శనివారం సాయంత్రం ముంబైలోని ట్రాఫిక్ కంట్రోల్ సెల్‌కు ఒక నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో సమాచారాన్ని యూపీ పోలీసులకు చేరవేశారు. మెసేజ్ పంపిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
గత నెలలో మహారాష్ట్ర ఎన్సీపీ పవార్ వర్గం నేత బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపిన విషయం తెలిసిందే. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉన్నందుకే చంపామని తెలిపారు. సిద్ధిఖీ కుమారుడు జీశాన్, సల్మాన్ ఖాన్‌కు కూడా బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముస్తఫా అనే వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.