నల్లగొండ : కాంగ్రెస్ ప్రజా పాలనలో రాష్ట్రంలోని ఆడబిడ్డలు అరిగోసపడుతున్నారు. గుక్కెడు నీళ్ల కోసం మహిళలు రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా మిషన్ భగీరథ(Mission Bhagiratha) నీళ్ల కోసం నల్లగొండ జిల్లాలో ఆందోళన చేపట్టారు. నల్లగొండ(Nalgonda) మండలం చెన్నారం గ్రామంలో నెల రోజులుగా తాగునీరు రాకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానిక వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెల రోజులుగా ఇబ్బంది పడుతున్నా, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మహిళల ఆందోళనతో నల్లగొండ- కనగల్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదని బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
నల్లగొండ మండలం చెన్నారం గ్రామంలో నెల రోజులుగా త్రాగునీరు రాకపోవడంతో రోడ్డెక్కిన మహిళలు.. నల్గొండ కనగల్ రహదారిపై భారీ ట్రాఫిక్ pic.twitter.com/2vbbomCkHm
— Telugu Scribe (@TeluguScribe) November 3, 2024