కామారెడ్డి : కామారెడ్డి జిల్లా(Kamareddy )లింగంపేట మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లింగంపేట గ్రామంలోని జంబి హనుమాన్ దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు హనుమాన్ చాలీసాకు (Hanuman chalisa)సంబంధించిన ఫ్లెక్సీని, కాషాయ జెండాలను తగలబెట్టారు. ఈ ఘటనతో హిందూ వర్గాలు తీవ్ర ఆందోళనకు సిద్ధమవుతుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
మరో వర్గానికి చెందిన వ్యక్తుల పనిగా అనుమానం వ్యక్తం చేస్తున్న హిందువులు, పలు ధార్మిక సంస్థలకు చెందిన ప్రజలంతా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగించేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గతంలోనూ ఇదే ఆలయంలో ఇదే తరహా ఘటనలు జరిగాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.