Ball Tampering : ఆస్ట్రేలియా పర్యటనలో భారత ఏ (India A) జట్టు ఆటగాళ్లకు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఆసీస్ ఏ జట్టుతో జరిగిన అనధికార టెస్టు మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్లు బాల్ ట్యాంపరింగ్(Ball Tampering) ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంపైర్ బెన్ ట్రెలోర్, షవాన్ క్రెగ్లు ఇదే విషయంపై భారత జట్టును మందలించారు. అయితే.. తామేమీ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడలేదని, తమపై అనవసరంగా నింద మోపుతున్నారని టీమిండియా ఆటగాళ్లు నిరసన తెలిపారు. అంపైర్లతో గొడవ పడ్డారు కూడా.
గ్రేట్ బారియర్ రీఫ్ అరెనాలో ఆదివారం ఆట మొదలైన కాసేపటికే అంపైర్లు బంతిని మార్చారు. భారత ఆటగాళ్లు ఉద్దేశ పూర్వంగా బంతి ఆకారాన్ని దెబ్బ తీశారని అంపైర్ షాన్ క్రెగ్(Shawn Craig) అరోపించాడు. ‘మీరు బంతిని గీరితే మేము కొత్త బంతి ఇస్తాం. అంతే తప్ప ఏ విధమైన చర్చ అవసరం లేదు. ఆట కొనసాగించండి’ అని భారత క్రికెటర్లతో అన్నాడు. అతడి మాటలకు చిర్రెత్తుకొచ్చిన ఇషాన్ కిషన్ (IshanKishan) ‘ఇదేంటీ.. మేము ఏమీ చేయలేదు. అది నిజం తెలివి తక్కువ పని’ అని అంపైర్‌తో అన్నాడు.
Ishan Kishan voiced his displeasure about the change of ball before play today, but he won’t be charged for dissent 👉https://t.co/DdWs0mjMWq#AUSAvINDA pic.twitter.com/t6pF8nhUof
— ESPNcricinfo (@ESPNcricinfo) November 3, 2024
అందుకు క్రెగ్.. ‘నీ మాటలకు బాధ పడుతావు. నీ ప్రవర్తన సరిగా లేదు’ అని ఇషాన్‌కు బదులిచ్చాడు. ఈ మొత్తం వ్యవహారంపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. ‘భారత ఆటగాళ్లు ఎవరూ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడలేదని, పూర్తిగా దెబ్బతిన్నడం వల్లనే బంతిని మార్చాల్సి వచ్చింద’ని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.