CWC 2023: రికార్డుల దుమ్ముదులిపిన వన్డే వరల్డ్ కప్.. స్టేడియాలకు పోటెత్తిన అభిమానులు
CWC 2023: 45 రోజుల పాటు సాగిన ఈ మెగా టోర్నీని స్టేడియాలకు వచ్చి చూసినవారి సంఖ్యను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించింది. భారత్‌లోని పది నగరాల్లో నిర్వహించిన ఈ టోర్నీని స్టేడియానికి వచ్చి చూసినవారి సంఖ్య అక్షరాలా...
CWC 2023: రెండ్రోజుల క్రితం భారత్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ పలు పాత రికార్డులను బద్దలుకొట్టింది. ఆటలోనే గాక ఆటేతర విషయాలలో కూడా ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా రికార్డులు సృష్టించింది. 45 రోజుల పాటు సాగిన ఈ మెగా టోర్నీని స్టేడియాలకు వచ్చి చూసినవారి సంఖ్యను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించింది. భారత్‌లోని పది నగరాల్లో నిర్వహించిన ఈ టోర్నీని స్టేడియానికి వచ్చి చూసినవారి సంఖ్య అక్షరాలా 12 లక్షల 50 వేల 307 మందిగా నిర్దారించింది. ఇప్పటివరకూ జరిగిన ఏ ఒక్క ఐసీసీ ఈవెంట్‌కూ ఇంతమంది రాలేదు.
వాస్తవానికి అక్టోబర్ 05న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ప్రేక్షకులే కనిపించలేదు. దాదాపు స్టేడియం అంతా ఖాళీగానే దర్శనమిచ్చింది. ఆ తర్వాత భారత్ ఆడే మ్యాచ్‌లు మినహా అంతా చప్పచప్పగానే సాగింది. కానీ నెదర్లాండ్స్, అఫ్గానిస్తాన్ జట్ల అనూహ్య విజయాలు, సౌతాఫ్రికా ఆటగాళ్ల మెరుపు బ్యాటింగ్‌కు తోడు ఉత్కంఠ మ్యాచ్‌లు కూడా అభిమానులను స్టేడియాలకు రప్పించాయి. వరల్డ్ కప్ మిడ్ షెడ్యూల్ ముగిసేసరికి ఈ టోర్నీని స్టేడియానికి వచ్చి చూసిన వారి సంఖ్య ఏకంగా ఐదు లక్షలు దాటింది.
The biggest EVER 👏 🥳
Thank YOU to all of our fans who helped make #CWC23 the most attended yet! 🏟
More 📲 https://t.co/4womT6R5rv pic.twitter.com/cqNwNlPPsp
— ICC (@ICC) November 21, 2023
ఇక నాకౌట్ మ్యాచ్‌లకు కూడా ఫ్యాన్స్ ఎగబడి హాజరయ్యారు. భారత్ – న్యూజిలాండ్ మధ్య వాంఖెడే వేదికగా జరిగిన తొలి సెమీస్‌కు మొత్తం స్టేడియం నిండిపోయింది. ఆసీస్ – సౌతాఫ్రికా మధ్య కోల్‌కతాలో జరిగిన రెండో సెమీస్‌లో కూడా ఈడెన్ గార్డెన్స్ కూడా దాదాపు నిండింది. భారత్ – ఆసీస్ మధ్య అహ్మదాబాద్‌లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌ను ప్రత్యక్షంగా వీక్షించినవారి సంఖ్య సుమారు 95వేలకు తగ్గలేదు.
- 2015లో ఆసీస్, కివీస్ వేదికలుగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ను 10,16,420 మంది వీక్షించారు.
- 2019లో ఇంగ్లండ్, వేల్స్లో జరిగిన వరల్డ్ కప్‌ను చూసినవారు 7, 52,000 మాత్రమే.
- తాజాగా 2019లో ఏకంగా 12,50,307 మంది ప్రపంచకప్ సమరాలను చూశారు.
- నేరుగా స్టేడియాలకు వచ్చినవారి పరంగానే గాక టీవీలు, మొబైల్ తెరల మీద కూడా వరల్డ్ కప్ పాత రికార్డులను బద్దలుకొట్టింది. భారత్, ఆసీస్ ఫైనల్ మ్యాచ్‌ను డిస్నీ హాట్ స్టార్‌లో ఏకంగా 5.6 కోట్ల మంది చూశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

