Ranji Trophy : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు రజత్ పాటిదార్ (Rajat Patidar) రంజీ ట్రోఫీలో చితక్కొట్టాడు. టోర్నీ చరిత్రలోనే ఐదో వేగవంతమైన శతకం బాదేశాడు. దులీప్ ట్రోఫీలో విఫలమైన పాటిదార్ రంజీల్లో రఫ్ఫాడించాడు. మధ్యప్రదేశ్ తరఫున ఆడుతున్న ఈ చిచ్చరపిడుగు మంగళవారం హర్యానా బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 68 బంతుల్లోనే వంద కొట్టేశాడు. దాంతో, 2015లో తమ జట్టు ఆటగాడు నుమాన్ ఓజా పేరిట ఉన్న 69 బంతుల్లో సెంచరీ రికార్డును పాటిదార్ బద్ధలు కొట్టాడు.
రంజీ ట్రోఫీలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు మాత్రం టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) పేరిట ఉంది. విధ్వంసక ఆటగాడైన పంత్ 2016-17 సీజన్లో 48 బంతుల్లోనే వంద పరుగులు బాదేసి చెక్కు చెదరని రికార్డు నెలకొల్పాడు. నిజానికి.. శక్తి సింగ్ 1990లో హర్యానాపై 45 బంతుల్లోనే వంద కొట్టేశాడు. కానీ, సరైన పేపర్లు లేవనే కారణంతో అతడి పేరు రికార్డు పుస్తకాల్లో నమోదు చేయలేదు. దాంతో, ఈ టోర్నీలో వేగవంతమైన సెంచరీ కొట్టిన ఆటగాడిగా పంత్ పేరు నిలిచిపోయింది. టాప్-5 ఉన్నది ఎవరంటే..?
Fifth fastest Ranji hundred of all-time by Rajat Patidar 💯#RanjiTrophy #RajatPatidar pic.twitter.com/07RhH66wrz
— OneCricket (@OneCricketApp) October 29, 2024
1. రిషభ్ పంత్ – 48 బంతులు – 2016-17 సీజన్.
2.రియాన్ పరాగ్ – 56 బంతులు – 2023-24 సీజన్.
3. ఆర్కే బోరా – 56 బంతులు – 1989 – 88 సీజన్.
4. రూబెన్ పౌల్ – 60 బంతులు – 1995-96 సీజన్.
5. రజత్ పాటిదార్ – 68 బంతులు – 2024-25 సీజన్.
6. నమాన్ ఓజా – 69 బంతులు – 2015-16 సీజన్.
RAJAT PATIDAR , Batting at No. 3 for Madhya Pradesh, waltzed to his first hundred of the season in only 68 balls, setting the record for one of the fastest hundreds ever in the tournament.
Fastest Ranji Trophy hundreds being –
48 balls – Rishabh Pant (2016/17)
56 balls – Riyan… pic.twitter.com/5ls5eanItD— Dev (@devx_18k) October 29, 2024
మంగళవారం హర్యానా బౌలర్లను చెడుగుడు ఆడుకున్న పాటిదార్ 102 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సర్లతో 159 పరుగులు సాధించాడు. దాంతో, మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్‌ను 308 వద్ద డిక్లేర్ చేసి ప్రత్యర్థికి 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.