Srisailam | శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మ వార్లను సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. మంగళవారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణకు వేద పండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. తదుపరి ఆయన భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.
Cji1
అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో జస్టిస్ ఎన్వీ రమణకు అర్చక వేద పండితులు వేదాశీర్వచనం చేయించారు. ఆయనకు స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు ప్రసాదం, జ్ఞాపిక అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం పీఆర్వో శ్రీనివాసరావు, ఏఈఓ హరిదాస్, పర్యవేక్షకులు శివప్రసాద్, సీఐ ప్రసాద్ రావు పాల్గొన్నారు.