Harbhajan Singh : ఐపీఎల్ రిటెన్షన్ వ్యవహారం కొన్ని ఫ్రాంచైజీలకు తలనొప్పిగా మారుతోంది. గడువు సమీపిస్తుండడంతో ఫ్రాంచైజీలు ఎవరిని వదిలేయాలో తెల్చుకోలేకపోతున్నాయి. ఇక డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) పరిస్థితి అయితే మరీ దారుణం. జట్టు నిండా ఆల్‌రౌండర్లు, పవర్ హిట్టర్లు ఉన్న కోల్‌కతా 17వ సీజన్లో సమిష్టి ప్రదర్శనతో ట్రోఫీని తన్నుకుపోయింది.
ఆరుగురిని మాత్రమే అట్టిపెట్టుకోవాల్సి రావడంతో ఎవరెవరని వదిలేయాలి? రైట్ టు మ్యాచ్ అవకాశాన్ని ఎవరికోసం వినియోగించాలి? అని ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం ఆలోచనల్లో పడింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ కీలక సూచన చేశాడు. ఇంతకూ భజ్జీ ఎవరికి ఓటేశాడంటే..?
IPL is bigger than International Cricket and
KKR is the current IPL Champions.🏆pic.twitter.com/96Ye6dxN8l
— Brendon Mishra 🇮🇳🔥 (@KKRKaFan) October 26, 2024
పద్దెనిమిదో సీజన్ కోసం ఆరుగురిని మాత్రమే అట్టిపెట్టుకొనే వీలుండడం కోల్‌కతాకు పెద్ద సవాలే. ఎందుకంటే.. మ్యాచ్ విన్నర్లు అయిన ఆటగాళ్లను వదిలేయడం ఆ ఫ్రాంచైజీకి చాలా కష్టంగానే ఉంటుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను కోల్‌కతా వదిలేస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. హర్భజన్ మాత్రం అయ్యర్‌ను అట్టిపెట్టుకోవాలని అంటున్నాడు. ‘కోల్‌కతా కచ్చితంగా శ్రేయస్ అయ్యర్‌ను రిటైన్ చేసుకోవాలి. అతడితో పాటు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్, ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్‌ను అట్టిపెట్టుకోవాలి. ఇక.. సిక్సర్ల వీరుడు రింకూ సింగ్‌ను ఐదో ఆటగాడిగా రిటైన్ చేసుకోవాలి. యువకెరటం రమన్‌దీప్ సింగ్‌ను ఆరో ఆటగాడిగా కొనసాగించాలి’ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు.
Harbhajan Singh’s Retention Picks for KKR. pic.twitter.com/ucMPYaXIdz
— Rokte Amar KKR 🟣🟡 (@Rokte_Amarr_KKR) October 28, 2024
ఐపీఎల్ 17వ సీజన్ ఆసాంతం అదరగొట్టిన కోల్‌కతా మూడోసారి ట్రోఫీ అందుకుంది. మాజీ కెప్టెన్ గంభీర్ మెంటార్‌గా జట్టు కాంబినేషన్లో మార్పులకు శ్రీకారం చుట్టగా.. కోల్‌కతా లీగ్ దశ నుంచి ప్రత్యర్థులను బెంబేలెత్తించింది. ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ను 113 పరుగులకే కట్టడి చేసిన కోల్‌కతా.. అనంతరం 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించి చాంపియన్‌గా నిలిచింది.