Road Accident | రాజస్థాన్ సికార్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందగా.. మరో 35 మందికిపైగా గాయపడ్డారు. సేల్సర్ నుంచి లక్ష్మణ్‌గఢ్‌కు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఫ్లై ఓవర్ వద్ద మలుపు తిరుగుతుండగా గోడను ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం క్షతగాత్రులను లక్ష్మణ్‌గఢ్, సికార్ ఆసుపత్రులకు తరలించారు. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో జైపూర్‌కి తరలించారు. బస్ అదుపు తప్పి ఫ్లై ఓవర్ గోడను ఢీకొట్టిందని సికార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భువన్ భూషన్ యాదవ్ పేర్కొన్నారు. ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 35 మంది గాయపడగా.. లక్ష్మణ్‌గఢ్, సికార్ ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.
అయితే, ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లక్ష్మణ్‌గఢ్ నుంచి జైపూర్ – బికనీర్ రహదారి వైపు వెళ్లాల్సి ఉండగా.. మూలమలుపు వద్ద బస్సు తిరగాల్సి ఉండగా.. వేగంగా ఉండడంతో గోడను ఢీకొట్టింది. దాంతో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. సంఘటనా స్థలం క్షతగాత్రుల రోధనలు, కేకలతో మార్మోగింది. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా సంఘటనా స్థలానికి చేరుకొని బస్సులో నుంచి బయటకు తీసి ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న కలెక్టర్, ఎస్పీ భవన్ భూషణ్, డీఎస్పీ షాహిన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై సీఎం భజన్‌లాల్ శర్మ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు నా సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
सीकर के लक्ष्मणगढ़ क्षेत्र में बस दुर्घटना में हुई जनहानि अत्यंत दुःखद एवं हृदयविदारक है। मेरी गहरी संवेदनाएं मृतकों के शोकसंतप्त परिवारजनों के साथ हैं।
संबंधित अधिकारियों को घायलों का समुचित उपचार सुनिश्चित करने हेतु निर्देशित किया गया है।
प्रभु श्री राम से प्रार्थना है कि…
— Bhajanlal Sharma (@BhajanlalBjp) October 29, 2024