IPL Retention : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రిటెన్షన్ జాబితా ఇచ్చేందుకు గడువు సమీపిస్తోంది. ఇంకా కొన్ని గంటలే ఉండడంలో అన్ని ఫ్రాంచైజీలు ఈరోజు సాయంత్ర 5ః30 కల్లా తాము అట్టిపెట్టుకుంటున్న ఆటగాళ్ల పేర్లను వెల్లడించనున్నాయి. దాంతో, 10 జట్లు రిటైన్ చేసుకోబోయే ఆ ఆరుగురు ఎవరు? అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే.. పలువురు టీమిండియా స్టార్లు ఈసారి కొత్త జట్లకు ఆడే అవకాశముంది. వాళ్లలో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (Mohammad Shami) కూడా ఉండే అవకాశముంది.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో పాటు డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, సాయి సుదర్శన్‌లను మాత్రమే గుజరాత్ టైటాన్స్ అట్టిపెట్టుకోనుంది. గాయం కారణంగా 2024 సీజన్‌కు దూరమైన షమీని వదిలేయనుంది. మోకాలి సర్జరీ (Knee Surgery) నుంచి కోలుకున్న షమీ ఇంకా ఫిట్నెస్ సాధించకపోవడమే అందుకు కారణం. దాంతో, అతడు వేలానికి రావడం ఖాయమనిపిస్తోంది.
As per reports, Royal Challengers Bengaluru is to go after Mohammad Shami in 2025 mega auction if not retained by Gujarat Titans
📷: BCCI#IPLRetention #IPL2025 #RoyalChallengersBengaluru #MohammadShami #GujaratTitans #RCB #PlayBold pic.twitter.com/NBjaxlREAg
— SportsTiger (@The_SportsTiger) October 30, 2024
ఒకవేళ అదే జరిగితే ఐపీఎల్లో సుదీర్ఘ అనుభవం గల షమీని కొనేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) సిద్ధమవుతోంది. పవర్ ప్లేలో నిప్పులు చెరిగే ఈ స్పీడ్‌స్టర్‌ను పట్టేసి తమ బౌలింగ్ యూనిట్‌ను బలంగా మార్చుకోవాలని ఆర్సీబీ భావిస్తోంది. 2022 మినీ వేలంలో షమీని గుజరాత్ రూ.6.25 కోట్లకు కొన్నది. ఇప్పుడు ఆర్సీబీ ఏ ధరకు అతడిని సొంతం చేసుకుంటుందో చూడాలి. 17 సీజన్లుగా ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్నబెంగళూరుకు మళ్లీ విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్ అవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఐపీఎల్లో విజయవంతమైన బౌలర్లలో ఒకడైన రెండు సీజన్లు గుజరాత్‌కు ఆడాడు. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ పేస్ అస్త్రంగా పేరొందిన అతడు పవర్ ప్లేలో అద్భుతంగా రాణించాడు. 2022, 2023 ఎడిషన్లలో షమీ 33 మ్యాచుల్లో 48 వికెట్లు పడగొట్టాడు. కానీ, మోకాలికి గాయం కావడంతో అతడు 17వ సీజన్‌కు దూరమయ్యాడు. కెప్టెన్ పాండ్యా కూడా ముంబై ఇండియన్స్‌కు వెళ్లడం.. కుర్రాడైన శుభ్‌మన్ గిల్ అనుభవలేమి కారణంగా గుజరాత్ 8వ స్థానంతో సరిపెట్టుకుంది. అందుకని ఈసారి మెగా వేలంలో ప్రతిభావంతుల్ని కొనేందుకు యాజమాన్యం అడుగులు వేస్తోంది.
నిరుడు స్వదేశంలో జరిగని వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లతో రికార్డు సృష్టించిన షమీ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. లండన్‌లో మోకాలి సర్జరీ చేయించుకున్న అతడు వేగంగా కోలుకున్నాడు. అయితే.. ఆస్ట్రేలియా పర్యటనకు సెలెక్టర్లు షమీని ఎంపిక చేయలేదు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో ఫిట్నెస్ సాధిస్తున్న అతడు రంజీ ట్రోఫీలో ఆడనున్నాడు. రంజీల్లో అదరగొడితేనే మళ్లీ షమీకి భారత జట్టులో అవకాశం రానుంది.