Fire Accident | విశాఖపట్నం జైలురోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన బ్రాంచ్‌లో గురువారం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో కస్టమర్ కౌంటర్లు, ఛాంబర్లు మంటల్లో దగ్ధమయ్యాయి. కంప్యూటర్లతో పాటు పలు డాక్యుమెంట్స్ కాలిపోయాయని సమాచారం. అయితే, లాకర్స్ సురక్షితంగానే ఉన్నాయని బ్యాంకులు అధికారులు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.