నిబంధనలు జాన్తా నై
“ఆయనో బా ధ్యత గల పంచాయతీ కార్యదర్శి. ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాల్సిన ఆయనే నిబంధనలకు తూట్లు పొడిచారు. పంచాయతీ నిర్వహణ కోసం చేసిన ఖర్చుల పేరుతో సర్పంచ్ కు తెలియకుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.4.10 లక్షలు డ్రా చేశాడు. ప్రభుత్వ నిధులను బాధ్యతాయుతంగా ఖర్చు చేయాల్సిన ఉద్యోగి కంచే చేను మేసిన చందంగా నిబంధనలు తుం గలో తొక్కడం వివాద్పాదమైంది.
- సర్పంచ్ కు తెలియకుండానే నిధులు డ్రా..
- ఖర్చుల పేరుతో కార్యదర్శి అత్యుత్సాహం
నిడమనూరు, ఫిబ్రవరి 26: “ఆయనో బా ధ్యత గల పంచాయతీ కార్యదర్శి. ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాల్సిన ఆయనే నిబంధనలకు తూట్లు పొడిచారు. పంచాయతీ నిర్వహణ కోసం చేసిన ఖర్చుల పేరుతో సర్పంచ్ కు తెలియకుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.4.10 లక్షలు డ్రా చేశాడు. ప్రభుత్వ నిధులను బాధ్యతాయుతంగా ఖర్చు చేయాల్సిన ఉద్యోగి కంచే చేను మేసిన చందంగా నిబంధనలు తుం గలో తొక్కడం వివాద్పాదమైంది. సిబ్బంది వేతనాల చెల్లింపు కోసం పంచాయతీ ఖాతా పరిశీలించడంతో అసలు విషయం బయటపడటంతో నివ్వెరపోవడం గ్రామ సర్పంచ్ వంతైంది.
ఈ సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం శాఖాపురం గ్రామ పంచాయతీలో ఆలస్యంగా వెలుగు చూసిం ది. సర్పంచ్ తెలిపిన వివరాల ప్రకారం… శాఖాపురం పంచాయతీ కార్యదర్శి సైదులు సుమారు తొమ్మిది నెలల క్రితం వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టారు. దీంతో గుంటిపల్లి కార్యదర్శి చిట్టిపల్లి అశోక్‌కు అధికారులు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. సుమారు తొమ్మిది నెలల పాటు శాఖాపురం పంచాయతీలో ఆయన విధులు నిర్వర్తించారు. రెండు నెలల క్రితం నూతన పంచాయతీ పాలకవర్గం ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా 10 రోజుల క్రితం సెలవులో ఉన్న పంచాయతీ కార్యదర్శి సెలవులు ముగించుకుని విధుల్లో చేరడంతో ఇన్చార్జి బాధ్యతల నుంచి అశోక్ తప్పుకున్నారు.
తాను శాఖాపురం పంచాయతీలో విధులు నిర్వహించిన సమయంలో రూ.4.10 లక్షలు ఖర్చు చేసినట్లు తనకు సదరు మొత్తాన్ని ఇటీవల విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించాలని నూతన సర్పంచ్‌ను కోరాడు. తాను అందుబాటులో లేనని ఖర్చుల తీరును పరిశీలించి చెల్లిస్తామంటూ సర్పంచ్ పేర్కొన్నారు. కార్యదర్శి అశోక్ ఈ-పంచాయతీ ఆపరేటర్ ద్వారా నిబంధనలను తోసిరాజని తన సొం త ఖాతాలోకి రూ.4.10లక్షలు బదిలీ చేయించాడు. కాగా గురువారం సిబ్బంది వేతనాలు చెల్లించేందుకు డబ్బు డ్రా చేసేందుకు వెళ్లిన పంచాయతీ కార్యదర్శి సైదులుకు గత కార్యదర్శి అశోక్ నిధులు డ్రా చేసిన విషయం తెలిసింది.
గ్రామ సర్పంచ్‌నైన తన ప్రమేయం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేసిన కార్యదర్శి అశోక్‌పై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సూర్యనారాయణ డిమాం డ్ చేస్తున్నారు. కార్యదర్శి అశోక్ తీరుపై డీఎల్సీఓ, ఎంపీడీఓలకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయమై ఎంపీడీఓ హిమబిందును వివరణ కోరగా నిబంధనలకు విరుద్ధంగా రూ.4.10 లక్షలను డ్రా చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. సర్పంచ్ సూర్యనారాయణ, కార్యదర్శి అశోక్‌తో మాట్లాడి నిధులు ప్రభుత్వ ఖాతాలో జమ చేయించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

